జనసేన కార్యకర్తలు క్రమశిక్షణ పాటిస్తే పార్టీ బలపడుతుందని మనోహర్ అన్నారు. గెలిచే సీట్లపైనే దృష్టిపెట్టి, కూటమిలో సహనం పాటించాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి విధుల్లోకి వస్తున్నారని స్వాగతించారు. రాజకీయాల్లో ఓపికతో జాగ్రత్తగా అడుగులు వేయాలని మనోహర్ తెలిపారు. విశాఖపట్నం: జనసేన రాజకీయంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ సంస్థాగతంగా కొంత బలహీనంగా ఉండవచ్చని, అయితే అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలను కార్యకర్తలంతా క్రమశిక్షణతో పాటిస్తే పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. విశాఖపట్నంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆశ పడవద్దని, కచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేద్దాం.. వంద శాతం స్ట్రైక్ రేట్ సాధిద్దామని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. తొందర పడి మనకు ఒత్తిడి వచ్చిందని, 100 ఇవ్వండి, 120 సీట్లు ఇవ్వండని మాత్రం అడగటం లాంటివి చేయవద్దన్నారు. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎల్లప్పుడూ తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారని మంత్రి నాదెండ్ల గుర్తుచేశారు. జనసేన పార్టీ బలోపేతం, కూటమి ధర్మంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన సంస్థాగతంగా బలంగా లేకపోవచ్చు, కానీ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కార్యకర్తలు వింటే మన పార్టీ బలంగా తయారవుతుందన్నారు. పార్టీ నాయకత్వం సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. అలాగే కూటమిలో కొనసాగుతున్న క్రమంలో ఎదురయ్యే పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. రాజకీయాల్లో కూటమిగా ముందుకు సాగుతున్నప్పుడు స్థానికంగా చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయభేదాలు తలెత్తడం సహజమని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో నాయకులు సహనం కోల్పోయినా, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు మాత్రం సంయమనం పాటించాలని సూచించారు. ట్రీట్మెంట్ కోసం కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో తిరిగి తన విధుల్లో నిమగ్నం అవుతున్నారని, ఆయనకు మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం పవన్ కళ్యాణ్ ఏ స్ఫూర్తితో అందరినీ నడిపించారో, అదే వేగంతో ఈ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆయన పేర్కొన్నారు. మనం ఏం చేయగలమో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చేసి చూపిద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానంలో ఓపికగా ఉంటూ, స్థానం కోల్పోకుండా సమస్యలను ఎదుర్కొనే విధానాన్ని స్వయంగా కష్టపడి అనుభవాల ద్వారా నేర్చుకోవాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీగా ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు వేసుకుంటూ వెళ్తున్నామని, రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలకంగా మారదామని సూచించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా కలిసి ప్రయాణిస్తున్న తరుణంలో కొన్నిచోట్ల చిన్న చిన్న ఇబ్బందులు సహజంగానే ఉంటాయని నాదెండ్ల మనోహర్ చెప్పారు. జనసేన పార్టీ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు? గెలిచే సీట్