సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అజేయ సెంచరీతో రాణించారు. ‘సి’ డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా... సికింద్రాబాద్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీవీ ఆనంద్... గ్రూప్ ‘హెచ్’లో భాగంగా ఆదివారం హైదరాబాద్ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం బాదారు. ఫలితంగా సికింద్రాబాద్ క్లబ్ 95 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సికింద్రాబాద్ క్లబ్ 39 ఓవర్లలో 328 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్ 82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 126 పరుగులు చేశారు. ఆయనతో పాటు జంషీద్ (77, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సికింద్రాబాద్ క్లబ్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ జిల్లా జట్టు 21.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా... వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్ క్లబ్‌ను విజేతగా ప్రకటించారు. బ్యాటింగ్‌లో శతకంతో కదంతొక్కిన సీవీ ఆనంద్... బౌలింగ్‌లో 5 ఓవర్లు వేసి ఎనిమిదే పరుగులివ్వడం విశేషం. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?