Kaizer News

Lalbaug Ganpati | లాల్‌బాగ్ గ‌ణ‌ప‌తి మండ‌పంలో విద్

Lalbaug Ganpati | లాల్‌బాగ్ గ‌ణ‌ప‌తి మండ‌పంలో విద్యుత్ షాక్.. ఇద్ద‌రు మృతి.. న‌లుగురికి గాయాలు

· National - India · ntnews.com

Lalbaug Ganpati : ముంబైలోని లాల్‌బాగ్ గ‌ణ‌ప‌తి మండ‌పంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా, మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ముంబై, లాల్‌బాగ్ ప్రాంతం, కాళిచౌకి ప‌రిధిలోని ద‌త్త‌రాం లాడ్ మార్గ్‌లో ఉన్న కాళచౌకి విభాగ్ సార్వ‌జ‌నిక్ ఉత్స‌వ్ మండ‌ల్ వ‌ద్ద శ‌నివారం అర్ధ‌రాత్రి 2.20 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగింది. ఈ మండ‌పం వ‌ద్ద నిర్వాహ‌కులు తాత్కాలిక డ్రింకింగ్ వాట‌ర్ స్టాల్ ఏర్పాటు చేశారు. స్థానిక గేటు వ‌ద్ద ఏర్పాటు చేసిన ఈ డ్రింకింగ్ స్టాల్ వ‌ద్ద ఫ్రిజ్‌లు వంటివి ఉన్నాయి. ఇక్క‌డ ఫ్రిజ్‌లు వంటి వాటికి విద్యుత్ ప్ర‌వ‌హించ‌గా.. ఐదుగురు విద్యుత్ షాక్‌కు గుర‌య్యారు. వీరిలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. మృతుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది. విద్యుత్ షాక్‌కు గురై గాయ‌ప‌డిన న‌లుగురిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే నిర్వాహ‌కులు అక్క‌డ విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. ఫైర్ సిబ్బంది, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించాయి. గాయ‌ప‌డ్డ‌వారిని స్తానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ముంబై కార్పొరేష‌న్ అధికారులు కూడా మండ‌పం వ‌ద్ద త‌నిఖీ నిర్వ‌హించారు

Original source: ntnews.com
Read more on Kaizer News