Kaizer News

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని యువకుడు దుర్మరణం

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని యువకుడు దుర్మరణం

· State - Telangana · prabhanews.com

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి రాజుపాలెం, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలోని కోల్డ్ స్టోరేజ్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయపురి సౌత్ నుంచి చేపల లోడుతో గుంటూరు వెళుతున్న వాహనం రాజుపాలెం వద్దకు చేరుకోగానే పంచర్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి పంచర్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మన్నెం గోపీనాథ్‌ (31) రాజుపాలెం నుంచి సత్తెనపల్లి వైపు వెళుతుండగా, ఆగి ఉన్న అశోక్ లేలాండ్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మణికృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు భార్య, కుమారుడు, కుమార్తెను విడిచి వెళ్లడంతో కుటుంబంలో విషాదం నెలకొంది

Original source: prabhanews.com
Read more on Kaizer News