Kaizer News

Anakapalli: మరిడిమాంబ నగర్‌లో మురుగు సమస్యకు పరిష్

Anakapalli: మరిడిమాంబ నగర్‌లో మురుగు సమస్యకు పరిష్కారం: పూడికతీత పనులు

· State - Telangana · hmtvlive.com

Shorts అనకాపల్లి: జీవీఎంసీ 112వ వార్డు పరిధిలోని విజయరామరాజుపేట, మరిడిమాంబ నగర్ ప్రాంతాల్లో కొంతకాలంగా వేధిస్తున్న మురుగునీటి నిల్వ సమస్యకు పరిష్కారం లభించింది. కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి, మురుగునీటి ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకు ప్రత్యేక యంత్రాల సహాయంతో విస్తృతంగా శుభ్రపరిచే పనులు చేపట్టారు. కాలువలు మూసుకుపోవడంతో వర్షాలు కురిసిన ప్రతిసారీ మురుగునీరు వెనక్కి తన్ని ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిన్నారులు, స్థానికులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానికుల విజ్ఞప్తిపై స్పందించిన భీమరశెట్టి రాంకీ సంబంధిత అధికారులతో పాటు వార్డు కూటమి నాయకులతో మాట్లాడి డ్రైనేజీ శుభ్రపరిచే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. వార్డు జనసేన పార్టీ కన్వీనర్ ఆళ్ల ఇందు రామచంద్రరావు సారథ్యంలో కూటమి నాయకులు పీలా లోకేష్, పాలురాజు తదితరులు డ్రైనేజీ పూడికతీత, క్లీనింగ్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మురుగు కాల్వలను క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా తమను వేధిస్తున్న సమస్యకు తక్షణ పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకున్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీతో పాటు సహకరించిన వార్డు కూటమి నాయకులకు మరిడిమాంబ నగర్ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News