Kaizer News

మాతృభాషను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

మాతృభాషను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

· State - Telangana · prabhanews.com

తెలుగు భాషను ప్రేమించి, భావితరాలకు అందించాలి ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మాతృభాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి. శైలజా రాణి తెలిపారు. మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉరవకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ మాతృభాష మన జీవితానికి తొలి మెట్టు అన్నారు. తల్లి, కుటుంబం, సమాజం నుంచి మనం మొదటగా నేర్చుకునే భాషే మాతృభాష అని తెలిపారు. మన భావాలను, ఆలోచనలను, అనుభూతులను సహజంగా వ్యక్తపరచడానికి మాతృభాష ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలుగు భాషకు గొప్ప చరిత్ర, సమృద్ధమైన సాహిత్య సంపద, అద్భుతమైన శబ్ద సౌందర్యం ఉన్నాయని తెలిపారు. నన్నయ, తిక్కన, ఎర్రప్రగడ వంటి కవులు తెలుగు భాషకు విశిష్టమైన సేవలు అందించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులు ఆంగ్లంతో పాటు ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమని, అయితే ఇతర భాషలను నేర్చుకునే క్రమంలో మాతృభాషను మరచిపోకూడదని సూచించారు. ఇతర భాషలను గౌరవిస్తూ మాతృభాషను ప్రేమించి, పరిరక్షించుకోవాలని శైలజా రాణి అన్నారు. మాతృభాష కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, విలువలు, వ్యక్తిత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. మాతృభాషను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులు తెలుగు పుస్తకాలను చదవడం, తెలుగు సాహిత్యాన్ని తెలుసుకోవడం, తెలుగులో మాట్లాడటం, రాయడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. సాంకేతికతను కూడా మాతృభాష అభివృద్ధికి ఉపయోగించుకోవాలని తెలిపారు. తెలుగు భాషను గౌరవిస్తూ దాని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. మాతృభాషను కాపాడుకోవడంతో పాటు మన సంస్కృతిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ సోమశేఖర్‌ మాట్లాడుతూ మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబమని అన్నారు. మాతృభాషను గౌరవించడం అంటే మన మూలాలను, సంస్కృతిని గౌరవించడమేనని పేర్కొన్నారు. జమీల బీబీ మాట్లాడుతూ మాతృభాష మన ఆలోచనా విధానానికి, భావ వ్యక్తీకరణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఇతర భాషలను నేర్చుకోవడం అవసరమే అయినప్పటికీ మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. తెలుగు సాహిత్యం, సామెతలు, జానపద గేయాలు, కథలు వంటి భాషా సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అధ్యాపకులు నారాయణస్వామి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో అనేక భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, అయితే మాతృభాషకు తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు. మాతృభాషలో బలమైన పునాది ఏర్పడితే ఇతర భాషలను కూడా సులభంగా నేర్చుకోవచ్చని తెలిపారు. అన్ని భాషలను గౌరవిస్తూ భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రాచీన కవుల పద్యాలను రాగయుక్తంగా ఆలపించి వినిపించారు. బోటనీ అధ్యాపకురాలు, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమ అధికారి విష్ణుప్రియ మాట్లాడుతూ ఒక మొక్కకు వేర్లు ఎంత ముఖ్యమో, మనిషికి మాతృభాష అంతే ముఖ్యమని అన్నారు. మాతృభాష మన సంస్కృతి, వ

Original source: prabhanews.com
Read more on Kaizer News