ఊట్కూర్, ఆంధ్రప్రభ : హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే విశ్వహిందూ పరిషత్ ప్రధాన లక్ష్యమని విహెచ్‌పీ జిల్లా కార్యదర్శి కన్నా శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. రాములు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఊట్కూర్ ప్రఖండ విహెచ్‌పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా శివకుమార్, ఏ. రాములు మాట్లాడుతూ సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు విహెచ్‌పీ స్థాపన దినోత్సవ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. రానున్న దుర్గాష్టమి, గోకులాష్టమి, శౌర్య దివస్, గీతా జయంతి, సామాజిక సమరసత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామంలో విహెచ్‌పీ కార్యక్రమాలను విస్తరించడంతో పాటు సభ్యత్వ నమోదు చేపట్టాలని నాయకులు కోరారు. హిందువులందరూ కుల, ప్రాంతీయ భేదాలను అధిగమించి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సమరసత, ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేసి రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల విహెచ్‌పీ అధ్యక్షులు, కార్యదర్శులు నర్వ బసప్ప, సంజప్ప, భరత్‌కుమార్, అనిల్‌కుమార్, ఆకుల రాంనరేశ్, మెట్టు కృష్ణయ్య, మండల అధ్యక్షుడు భీమ్రాజ్, ప్రఖండ అధ్యక్షుడు వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడు జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు