రాష్ట్రంలో వర్షపాతం లోటుతో విద్యుత్ డిమాండ్ పెరిగింది 12 నెలల కాలానికి నీటి భద్రత కార్యక్రమాలు చేపడుతున్నాం సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం.. ఫలితంగా జలాశయాల్లోకి నీటి ప్రవాహం తగ్గుదల, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్ డిమాండ్ పెరుగుదల వంటి పరిణామాలు తలెత్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమస్య తీవ్రతను ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నుంచే వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. శాసనసభలో ఎల్‌నినోపై లఘు చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. సెప్టెంబర్ 18 నాటికి సాధారణంగా 640 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 543 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైందన్నారు. ఎల్‌నినో పరిస్థితులు రాబోయే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల మొత్తం 553 టీఎంసీల సామర్థ్యానికి ప్రస్తుతం 311 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గోదావరి బేసిన్‌లో 255 టీఎంసీలకు గాను 154 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 808 టీఎంసీల సామర్థ్యానికి 465 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, రాజీవ్ భీమా, జె.చొక్కారావు దేవాదుల, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా చర్యలు చేపట్టామని చెప్పారు. వర్షాలు తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా పడిపోయిందని, గత ఏడాది ఇదే సమయంలో 1,940 మెగావాట్లుగా ఉన్న హైడల్ ఉత్పత్తి ఈ ఏడాది 422 మెగావాట్లకు పరిమితమైందని తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం 10.41 గంటలకు తెలంగాణలో 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, గతేడాది సెప్టెంబర్ 9న గరిష్ట డిమాండ్ 15,585 మెగావాట్లు కాగా, ఈ ఏడాది దాదాపు 4,000 మెగావాట్ల అదనపు భారం ఏర్పడిందన్నారు. ప్రాణహిత–చేవెళ్ల కడదామా? వద్దా? తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ సహకరిస్తుందా? లేదా? స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు ప్రాణహిత–చేవెళ్ల అంశాన్ని ప్రస్తావించడంతో భట్టి స్పందించారు. కరువుపై కేంద్ర సాయం ఏదీ: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏవిధంగా సహకరిస్తుందో బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తి చేసి ఆదిలాబాద్‌కు నీళ్లు అందించేందుకు సహకరిస్తారా అని మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఉపాధి విషయంలో ప్రత్యేక చర్యలు: మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగానే ఉండనున్నందున ఉపాధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకు