Kaizer News

Tadepalli: తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో ₹64 లక్షలత

Tadepalli: తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో ₹64 లక్షలతో బిటి రోడ్డు పనులు!

· State - Telangana · hmtvlive.com

Tadepalli: మంత్రి నారా లోకేష్ సహకారంతో కె.ఎల్ రావు కాలనిలో 64 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసిన వెంకట్రావు.రాష్ట్ర ఐటీ & ఎలక్ట్రానిక్స్,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో సుమారు 64 లక్షల వ్యయంతో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని, తాడేపల్లి కెఎల్ రావు కాలనిలో 64 లక్షల రూపాయల వ్యయంతో, బిటి రోడ్డు నిర్మాణ పనులకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా, ఇవ్వని హామీలను సైతం గుర్తించి అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులను కూడా మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News