Kaizer News

Gandhari | పిడుగుపాటుకు ఇద్దరు రైతులకు గాయాలు

Gandhari | పిడుగుపాటుకు ఇద్దరు రైతులకు గాయాలు

· State - Telangana · ntnews.com

Gandhari | గాంధారి : పిడుగుపాటుకు చరవాణులు పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బొప్పాజీవాడ శివారులో చోటుచేసుకుంది. బొప్పాజీవాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గులకు చెందిన గైని శంకర్‌, బొప్పాజీవాడ శివారులోని పత్తి చేనులో గుంటకు కొడుతున్నారు. వర్షం రావడంతో ఇద్దరూ గొడుగు పట్టుకుని నిలుచున్నారు. ఈ క్రమంలో పిడుగు పడడంతో వారి వద్ద ఉన్న చరవాణులు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఇద్దరు రైతులు స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఎడ్ల బండిపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ రహదారి వరకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News