ఇలాంటి వైఖరిని తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు ఎథిక్స్ కమిటీ సిఫారసు వారం లోగా విచారణ పూర్తి, తదుపరి చర్యలకు అవకాశం ఆ లోగా ‘కడియం’ వాదననూ వినాలని నిర్ణయం చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన కమిటీ కీలక భేటీ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై వాడివేడి చర్చ.. ఇరు పక్షాల వాదనలు హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : సభా హక్కులను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అసెంబ్లి ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి వైఖరిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సభాపతి గడ్డం ప్రసాద్‌కు సిఫారసు చేయాలని నిర్ణయించింది. గరిష్టంగా వారం లోగా విచారణ పూర్తిచేయాలని, ఆలోగా ఫిర్యాదుదారుడు కడియం శ్రీహరి వాదననూ వినాలని తీర్మాణం చేసింది. ఒక సీనియర్ సభ్యుడిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించిన ఘటనపై చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లి ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు తమతమ వాదనలనుచ వినిపించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పాడి కౌశిక్‌రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందన్న కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిపై మోపిన రెండు అభియోగాలను ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. అలాగే సభా నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అనేక సందర్భాల్లో హూందాతనాన్ని మరిచి తమపై తీవ్రమైన పదజాలాన్ని వాడారని, ఆయనపై కూడా ఎథిక్స్ కమిటీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు ఎక్కడా తగ్గకుండా కమిటీ ముందు వాదనలు వినిపించాయి. సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడి పైనా ఉందని కాంగ్రెస్ సభ్యులు స్పష్టం చేశారు. సభలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కౌశిక్‌రెడ్డికి తన వివరణ చెప్పుకునే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యులు ఎథిక్స్ కమిటీలో కలిసే పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. పాడి కౌశిక్‌రెడ్డికి మరో నోటీసు ఇచ్చి వచ్చే వారం మరోసారి సమావేశమైనప్పుడు హాజరు అయ్యేట్లు చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఎథిక్స్ కమిటీ మొదటి సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించిన తీరుపై శాసనసభ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారన్న అభియోగాలను కాంగ్రెస్ సభ్యులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సభ హుందాతనాన్ని కాపాడేం