రక్షణ, సైనిక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అతిగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఓ ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అమెరికా సైన్యం రూపొందించిన ఓ తప్పుడు ఏఐ నివేదిక వల్ల చైనాతో దాదాపు సైనిక ఘర్షణ మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే అధికారులు చివరి నిమిషంలో నిజానిజాలను గుర్తించి ఆపరేషన్‌ను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తాజా నివేదికలు వెల్లడించాయి. నంబర్ 1 ఎకానమీగా భారత్.. అమెరికాను ఎప్పుడు దాటుతుందో తెలుసా? మిలటరీ దాడికి సిద్ధమైన అమెరికా బలగాలు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో మధ్యప్రాచ్యంలో ప్రయాణిస్తున్న ఓ చైనా నౌక అణ్వాయుధ రవాణా సామగ్రిని తీసుకెళ్తోందని నిఘా వర్గాలు భావించాయి. దీంతో ఆ నౌకను అడ్డగించేందుకు అమెరికా సైన్యం శరవేగంగా సన్నాహాలు చేసింది. సాయుధ బలగాలు నౌకలోకి ప్రవేశించడానికి.. విమానాలు గగనతలంలో మోహరించడానికి కూడా సిద్ధమయ్యాయి. అయితే చర్యలు తీసుకునే ముందు అధికారులు క్షుణ్ణంగా సమీక్షించగా.. ఆ నివేదికను యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌కు చెందిన ఓ విశ్లేషకుడు ఏఐ చాట్‌బాట్ సాయంతో తయారు చేసినట్లు తేలింది. ఏఐ తప్పుగా సంకేతాలు ఇవ్వడమే అసలు కారణం విచారణలో ఆ ఏఐ చాట్‌బాట్ నౌకలోని సరుకును పూర్తిగా తప్పుగా విశ్లేషించిందని స్పష్టమైంది. సమాచారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల తప్పుడు ముగింపు ఇచ్చింది. ఒకవేళ అమెరికా దళాలు ఆ చైనా నౌకపై దాడులు చేసి ఉంటే.. అది ఇరు దేశాల మధ్య మిలటరీ యుద్ధానికి దారితీసి ఉండేది. అధికారులు నివేదికను మళ్లీ తనిఖీ చేయడంతో ఆపరేషన్ రద్దయింది. H-1B visa: లబోదిబోమంటున్న ఐటీ దిగ్గజాలు! లక్ష డాలర్ల వీసా ఫీజు రెన్యూ.. సైన్యంలో పెరుగుతున్న ఏఐ వినియోగం ప్రస్తుతం అమెరికా సైనిక, నిఘా సంస్థలలో నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి, లక్ష్యాలను నిర్దేశించడానికి.. బడ్జెట్, లాజిస్టిక్స్ నిర్వహణకు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే కేవలం ఏఐ అందించే సమాచారం ఆధారంగానే దాడులు లేదా కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ప్రాణాంతకమని రక్షణ రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరియైన మానవ పరిశీలన లేకపోతే ఏఐ ఇచ్చే తప్పుడు డేటా భవిష్యత్తులో ఊహించని విపత్తులకు దారితీస్తుందని ఈ సంఘటన నిరూపించింది