Kaizer News

‘కస్తూర్బా’లో విషసర్పాలు

‘కస్తూర్బా’లో విషసర్పాలు

· State - Telangana · ntnews.com

భయాందోళనలో విద్యార్థినులు వేములవాడ రూరల్‌, సెప్టెంబర్‌ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం మర్రిపల్లిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విషసర్పాలు సంచరిస్తున్నాయి. పాఠశాలలో 330మంది విద్యార్థినులు ఉండగా.. ప్రతి నిత్యం రాత్రివేళలో పాములు, తేళ్లు రావడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారం క్రితం తరగతి గదితోపాటు ఆఫీస్‌ కార్యాలయానికి విషసర్పం వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేకాధికారి పద్మను వివరణ కోరగా.. గతంలో పాఠశాలలోకి విషసర్పాలు వచ్చిన వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించి అడవీలో వదిలి వేయించినట్టు తెలిపారు. తరగతి గదిలోకి ఉపాధ్యాయులు వెళ్లిన అనంతరమే విద్యార్థినులు వెళ్తున్నారని చెప్పారు. విషసర్పాలు రాకుండా ప్రహరీ ఎత్తు పెంచాలని ఇప్పటికే అధికారులకు విన్నవించామని, త్వరలోనే సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News