Kaizer News

అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఖమ్మం జిల్లాలో టైటా జ

అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఖమ్మం జిల్లాలో టైటా జాతి పక్షి

· Entertainment · v6velugu.com

వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమారం గ్రామంలో టైటా జాతికి చెందిన అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన ఆవుల ప్రవీణ్ ఇంటి వద్ద ఈ గుడ్లగూబ కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. గుడ్లగూబ రెక్కకు గాయం కావడంతో ఎగరలేక ఇంటి పరిసరాల్లోనే ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు అక్కడికి చేరుకుని గుడ్లగూబను పరిశీలించి, టైటా జాతికి చెందిన గుడ్లగూబగా గుర్తించారు. గుడ్లగూబకు చికిత్స చేయించి, సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు

Original source: v6velugu.com
Read more on Kaizer News