Kaizer News

Marripadu: వైఎస్సార్‌సీపీ కన్వీనర్ గృహ ప్రవేశానికి

Marripadu: వైఎస్సార్‌సీపీ కన్వీనర్ గృహ ప్రవేశానికి హాజరైన మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి

· State - Telangana · hmtvlive.com

Marripadu: మర్రిపాడు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ వేడుకలకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి కుటుంబ సభ్యులను మేకపాటి దంపతులు ఆత్మీయంగా పలకరించి, నూతన గృహ ప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మీయంగా ముచ్చటించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. కార్యక్రమంలో మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News