మంచిర్యాల/జైపూర్, వెలుగు: నేషనల్ హైవే 63లో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్రోడ్డు పనులు పూర్తిచేయడంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి వరకు హైవే నిర్మాణం ప్రారంభించి పదేండ్లు కావస్తున్నా జోడు వాగుల బ్రిడ్జికి మాత్రం మోక్షం కలగలేదు. ఇందుకు అవసరమైన ఫండ్స్, పర్మిషన్లు తీసుకురావడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైంది. ఎట్టకేలకు చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఫారెస్ట్ క్లియరెన్స్ సాధించారు. జోడు వాగులపై హైలెవల్బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ రోడ్డు పనుల కోసం రూ.120 కోట్లు సాంక్షన్ చేయించారు. ఇప్పటికే రెండేండ్లు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఎన్‌హెచ్63లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో రసూల్‌పల్లి నుంచి మహారాష్ట్ర బార్డర్‌లోని అర్జునగుట్ట ప్రాణహిత బ్రిడ్జి వరకు హైవే నిర్మాణానికి రూ.164 కోట్లు సాంక్షన్ చేసింది. ఈ పనులు ఆగుతూ.. సాగుతూ.. దాదాపు ఐదేండ్లు కొనసాగాయి. అయితే భీమారం, చెన్నూర్నడుమ ఉన్న రిజర్వ్ ఫారెస్టులో పనులకు క్లియరెన్స్ రాకపోవడంతో జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డు పనులు నిలిచిపోయాయి. అనుమతుల సాధనలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఫారెస్ట్ పర్మిషన్లకు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడంతో కేంద్రం సైతం చేతులెత్తేసింది. హైవే పనులు అసంపూర్తిగా మిగలడం వల్ల గత పదేండ్లగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే ఈ హైవేపై అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. చెన్నూర్ ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలిచిన తర్వాత జోడు వాగుల బ్రిడ్జి నిర్మాణంతో పాటు పెండింగ్ హైవే పనులపై దృష్టి పెట్టారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి అసంపూర్తి పనుల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పట్టుబట్టి ఫారెస్ట్ పర్మిషన్లతో పాటు ఫండ్స్ సాధించారు. వారి కృషి ఫలితంగా 2024 సెప్టెంబర్‌లో జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, పెండింగ్ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు సాంక్షన్ చేసింది. ఆ తర్వాత మరో రూ.20 కోట్లు కేటాయించింది. నిధులు మంజూరై రెండేండ్లు కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు ఈ ఏడాది మే నెలలో జోడు వాగుల వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.76.51 కోట్ల అంచనాలతో టెండర్కాల్చేశారు. ఈ ప్రక్రియ ఫైనల్స్టేజ్లో ఉన్నట్టు సమాచారం. ఇక చివరగా కేంద్ర, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులతో కూడిన త్రీమెన్‌కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులకు గ్రీన్‌సిగ్నల్