Kaizer News

మహిళల రాస్తారోకో

· State - Telangana · sakshi.com

పళ్ళిపట్టు: తాగునీటి ఎద్దడికి నిరసనగా మహిళలు రాస్తారోకో చేపట్టారు. పళ్లిపట్టు యూనియన్‌లోని కేశవరాజుకుప్పంలో 200కు పైగా కుటుంబాలు నివాసమున్నాయి. పంచాయతీ ద్వారా గ్రామీణులకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా తాగునీటికి ఎద్దడి నెలకొంటున్నట్లు తెలుస్తోంది. శనివారం పెరటాశి తొలి శనివారం సందర్భంగా ఇళ్లు శుభ్రం చేసి పూజలు చేసేందుకు నీటి కష్టాలు తలెత్తడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామంలోని ప్రదాన రోడ్డు మార్గంలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వాహన సేవలు స్తంభించాయి. అయితే రెండు గంటల పాటు గ్రామీణులు రాస్తారోకో చేపట్టిన పోలీసులు, అధికారులు రాక పోవడంతో మహిళలు పోరాటాన్ని కొనసాగించారు. చివరికి పొదటూరు పేట ఇన్‌స్పెక్టర్‌ రాఖీకుమారి, డిప్యూటీ బీడీఓ ఇంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని తాగునీటి సమస్య పరిష్కరించి చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ మేరకు రాస్తారోకోను మహిళలు విరమించారు. గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News