Kaizer News

Bhadrachalam: 176వ శతాధిక కవి సమ్మేళనం జయప్రదం కావ

Bhadrachalam: 176వ శతాధిక కవి సమ్మేళనం జయప్రదం కావాలి: ఐటీడీఏ పీవో రాహుల్!

· State - Telangana · hmtvlive.com

Shorts భద్రాచలం: ఎటపాక మండలం మేడువాయి లోని పాల్ రాజు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో జరిగే 176వ శతాధిక కవి సమ్మేళనం జయప్రదం కావాలి అని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆకాంక్షించారు. తన చాంబర్లో శతాధిక కవిసమ్మేళనం గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 200 మంది కవులు ఈ సమ్మేళనం లో పాల్గొననుండడం హర్షదాయకం అన్నారు. కవి సమ్మేళనాలు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని భావితరాలకు సాటి చెబుతాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు బాష వారసత్వ సంపదను ప్రపంచానికి తెలిసేలా భద్రాచలం కేంద్రంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధికార ప్రతినిధి, పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వరలక్ష్మి సాయిరాం, సీసీ కళావేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సురేష్ బాబు తోట మల్ల, జిల్లా ప్రతినిధి ఎర్రంశెట్టి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News