మదురైలో పుట్టిన సుబ్బలక్ష్మి, భారతీయ సంగీతానికి ప్రపంచ గుర్తింపు తెచ్చింది. ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ వేదికలపై కచేరీలు, చిత్రాలలో నటించారు. పద్మభూషణ్, భారతరత్న వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న మొదటి గాయని. భర్త మరణానంతరం కచేరీలు ఆపి, 2004లో కన్నుమూశారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రియులకు ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbulakshmi) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మన దేశంలో శాస్త్రీయ సంగీతం అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరుల్లో ఆవిడది ఒకరి. ఆమె జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఎం సుబ్బలక్ష్మి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్నారు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉంటే... వాళ్ళ కోసం, ఎవరీ సుబ్బలక్ష్మి? తెలుసుకోండి. ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి? మీకు తెలుసా? Who Was MS Subbulakshmi?: నార్త్, సౌత్ అని తేడాల్లేవ్... దేశమంతటా ఆమె పాపులర్. యావత్ భారతావనిని తన గాత్రంతో అలరించిన గొప్ప గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆమె కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అసలు పేరు మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. సెప్టెంబర్ 16, 1916న తమిళనాడులోని మదురైలో జన్మించారు. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారు. ఆమె భర్త పేరు టి. సదాశివం (T. Sadasivam). ఆయన పూర్తి పేరు తిరుచ్చి సదాశివం. ఆయన్ను కొందరు కల్కి సదాశివం అని కూడా అంటారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధులు. జర్నలిస్టుగా పని చేశారు. నిర్మాతగా సినిమాలు తీశారు. సదాశివంతో సుబ్బలక్ష్మి వివాహం 1940లో జరిగింది. కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా? సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి శిక్షణ పొందారు. మదురై శ్రీనివాస అయ్యంగార్, ఆమె తల్లి మదురై షణ్ముఖవడివు (వీణ విద్వాంసురాలు) కూడా ఆమె సంగీత అభ్యాసంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రముఖ వేదికలపై సంగీత కచేరీలు చేశారు సుబ్బలక్ష్మి. న్యూఢిల్లీలో, జాతీయ స్థాయి కార్యక్రమాలలో ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రదర్శనలు ఇచ్చారు. లండన్‌లో అంతర్జాతీయ స్థాయిలో కచేరీలు చేశారు. అలాగే, అగ్ర దేశం అమెరికాలోని న్యూయార్క్ కార్నెగీ హాల్‌లో ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా 1966లో ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రదర్శన ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఎడిన్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శన ఇచ్చారు. .. ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా? నటిగానూ తెరపై మెరిసిన సుబ్బలక్ష్మి! గాయనిగా మాత్రమే కాదు... నటిగానూ ఎంఎస్ సుబ్బలక్ష్మి తన ప్రతిభ చాటారు. ఆమె నటించిన తొలి చిత్రం 'సేవాసదనం' (1938). ఆ తర్వాత 'సావిత్రి' (1941), 'మీరా' (1945) తదితర సినిమాల్లో నటించారు. సంగీత కళామతల్లికి ఆమె చేసిన సేవకు గాను 1954లో పద్మభూషణ్, 1975లో పద్మవిభూషణ్, 1998లో భారతరత్న పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1956లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. భా