Kaizer News

బీజేపీ బస్తీమే సవాల్‌.. గ్రేటర్‌ వార్‌!

బీజేపీ బస్తీమే సవాల్‌.. గ్రేటర్‌ వార్‌!

· City - Hyderabad · prabhanews.com

పైకి యుద్ధం ప్రకటించినప్పటికీ లోపల కమలనాథుల మథనం అధికార, ప్రతిపక్షాలను ఢీకొట్టే ప్రయత్నంలో అంతుచిక్కని వ్యూహం గ్రేటర్‌ ట్రై కార్పొరేషన్ల ఎన్నికలు బీజేపీకి రెఫరెండమే అంటు-న్న విశ్లేషకులు ఒకవేళ ఈ మూడు స్థానాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తే.. అసెంబ్లీ ఎన్నికల నాటికి పెరగనున్న బలం రాజకీయంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునే గోల్డెన్‌ ఛాన్స్‌ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ పొలిటికల్‌ బ్యూరో : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యమంటున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్‌ మహానగరంలో జరగనున్న ఎన్నికలు ప్రీ ఫైనల్‌గా మారుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడిని కదిలించినా.. చర్చ గ్రేటర్‌ ఎన్నికల పైనే జరుగుతోంది. ఈసారి సాధించి తీరుతామన్న ధీమా, పట్టుదల కేడర్‌లో కనిపిస్తున్నప్పటికీ కొన్ని అంశాల్లో ప్రతికూలత తప్పదనిపిస్తోంది. ఈ క్రమంలో రెండు బలమైన రాజకీయ పక్షాలను తట్టుకుని నిలబడగలమా? అన్న సందేహం కూడా వారిని వెంటాడుతోంది. ఓ వైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ వ్యూహాలు, ఎత్తుగడలను తట్టుకుని పైచేయి సాధించడం అనుకున్నంత సులువైనది కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బస్తీమే సవాల్‌ అంటూ.. ఆ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నప్పటికీ లోపల అంతుచిక్కని మథనం కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పక్షాలను అధిగమించే క్రమంలో ఎదురయ్యే అవాతంరాలు, అడ్డంకులు, ఆర్థికపరమైన అంశాలతో కూడిన సవాళ్లను అనుసరించాలన్న కోణంలో ప్రస్తుతం మేధోమథనం జరుగుతోంది. గ్రేటర్‌ ట్రై కార్పొరేషన్ల ఎన్నికలు బీజేపీకి రెఫరెండమేనని, ఒకవేళ అనుకున్నది సాధించి మేయర్‌ పీఠాలను అధిష్టిస్తే, 2028 తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలు మెండుగా ఉన్నట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరగాల్సిన మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ తన పొలిటికల్‌ ఫోకస్‌ను తీవ్రం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మూడు ప్రధాన కార్పొరేషన్లతో పాటు, నార్త్‌ తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్ఠానం పక్కా వ్యూహాన్ని రచిస్తోంది. ఇప్పటికే నితిన్‌ నవీన్‌ మూడు రోజుల పాటు పర్యటించి.. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలోని బూత్‌ ప్రెసిడెంట్లతో, రాష్ట్ర కార్యవర్గంతో జరిపిన కీలక భేటీలలో దీనికి సంబంధించిన ముసాయిదా సిద్ధమైంది. ఇక్కడి సమస్యలను గుర్తించి నేతల మధ్య సయోధ్య ప్రయత్నాలు కూడా పూర్తి చేశారు. ఈ మెగా ఎన్నికల సమరానికి సంబంధించి వ్యూహాల అమలు, నిధులు, వనరుల సమీకరణపై బీజేపీ అగ్రనాయకత్వం ఒక స్పష్టమైన బ్లూప్రింట్‌ను ఖరారు చేసింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో, వరంగల్‌ అర్బన్‌ బెల్ట్‌లో పార్టీకి వచ్చిన భారీ ఓటింగ్‌ శాతాన్ని క్షేత్రస్థాయిలో సీట్లుగా మార్చుకోవడమే బీజేపీ అగ్రనేతల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేవలం సోషల్‌ మీడియా ప్రచారాలకే పరిమితం కాకుండా, ప్రతి డివిజన్‌

Original source: prabhanews.com
Read more on Kaizer News