Kaizer News

యుగాంతం రేంజ్‌లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్

యుగాంతం రేంజ్‌లో ముప్పు?.. నేపాల్‌కు చైనా మరో డెడ్లీ వార్నింగ్‌!

· National - India · sakshi.com

భారీ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే నేపాల్‌ను మరో జలప్రళయం ముంచెత్తుందన్న హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరదల ధాటికి ఏర్పడిన సహజ సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా హెచ్చరించింది. సరస్సులోని నీటి రంగు మరింత ముదురుతోందని.. ఇది కట్ట తెగే ప్రమాదానికి సంకేతం కావొచ్చని పేర్కొంది. ఎప్పుడైనా సరస్సు కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో సహాయక చర్యలకు, గల్లంతైన వాళ్ల కోసం కొనసాగుతున్న అన్వేషణకు తాజా వార్నింగ్‌ ఆటంకాలు కలిగిస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో బుధవారం దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు ఘోర నష్టాన్ని కలిగించాయి. అయితే ఆ సమయంలో ఎగువ ప్రాంతంలో గ్లేసియర్‌ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. దీంతో నదీ ప్రవాహానికి అడ్డుగా సహజ కట్ట ఏర్పడి.. దాని వెనుక బారియర్‌ సరస్సు ఏర్పడింది. చైనా జలవనరుల శాఖ ప్రకారం.. శుక్రవారం నాటికి అందులో సుమారు 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సరస్సు చైనాలోని చోచెన్‌ నది, నేపాల్‌లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది. కట్ట తెగితే.. 500 క్యూబిక్‌ మీటర్ల ప్రవాహం ఈ సరస్సు ఏ క్షణాన అయినా కట్టలు తెంచుకోవచ్చని చైనా నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టిబెట్‌ ప్రాంతంలో సహాయక చర్యలను సైతం నిలిపివేసింది. సరస్సు కట్టలో కొంత భాగం తెగితే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్‌ మీటర్ల నీరు నదిలోకి చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇది మొన్న సంభవించిన వరద ఉధృతితో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఉండే చాన్స్‌ ఉందని తెలిపింది. ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహించడం ప్రారంభమైందని వెల్లడించింది. దీంతో డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నేపాల్‌ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మైక్‌లలో చేస్తున్న హెచ్చరికలతో.. ఎత్తైన ప్రాంతాలకు తరలి పోతున్నారు. 600కు చేరువలో మృతుల సంఖ్య ఆకస్మిక వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. రసువాతోపాటు మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో 600 మంది దాకా మృతి చెందారు. 1,500 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు.. భారత సరిహద్దు వైపునకు కూడా కొన్ని మృతదేహాలు, బ్యాగులు కొట్టుకువస్తున్నాయి. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్‌ అంచనా వేసింది. అటు టిబెట్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పలువురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కైలాస్‌–మానస సరోవర్‌ య

Original source: sakshi.com
Read more on Kaizer News