ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు 10లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఈసారి కెప్టెన్సీ పోటీలో ఎవరు పాల్గొనాలన్న నిర్ణయాన్ని ‘పవర్ ఆఫ్ పీపుల్స్’ పేరుతో బిగ్ బాస్ ప్రజల చేతుల్లో పెట్టాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు వరుసగా ఆసక్తికరమైన గేమ్స్ ఇస్తూ.. పోటీని మరింత ఉత్కంఠగా మార్చాడు. హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్‌ను కూడా టాస్క్‌లో భాగం చేసేలా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. దీంతో శుక్రవారం ఎపిసోడ్‌లో ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు గ్రూప్‌గా గేమ్ ఆడుతున్నారు? అనే విషయం దాదాపు స్పష్టమైంది. బిగ్ బాస్ తెలుగు 10లో 12వ రోజు ఉదయం ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘దమ్ మసాలా బిర్యానీ’ పాటతో కంటెస్టెంట్లు నిద్రలేచారు. పాట వినిపించగానే హౌస్‌మేట్స్ డ్యాన్స్‌తో సందడి చేశారు. ఆ తర్వాత వంశీ, కృష్ణుడు, త్రిగుణ్.. చరణ్‌తో కలిసి ఆడిన టాస్క్ గురించి చర్చించుకున్నారు.మరోవైపు ఉదయం లేవగానే ముఖేష్ ‘ఫుడ్.. ఫుడ్’ అంటూ మాట్లాడుతున్నాడని దేబ్జానీ, రామ్‌ప్రసాద్‌తో చెప్పింది. తాను కెప్టెన్ అయితే ముఖేష్ ఎలా వ్యవహరిస్తాడో చూడాలని ఉందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ క్యాటగిరీలో రామ్‌ప్రసాద్, నరేష్ తమదైన శైలిలో అదరగొట్టారు. ‘ఛత్రపతి’ సినిమాలోని సూరీడు ఎపిసోడ్‌ను స్పూఫ్‌గా చేసి హౌస్‌మేట్స్‌ను నవ్వించారు. వీరిద్దరి కామెడీకి కంటెస్టెంట్లంతా ఫిదా అయ్యారు. చివరికి బిగ్ బాస్ కూడా వారి స్పూఫ్‌ను మెచ్చుకున్నాడు.మరోవైపు ఝాన్సీ, ముఖేష్, రోహిత్ కలిసి త్రిగుణ్ గురించి మాట్లాడుకున్నారు. త్రిగుణ్ కాస్త డల్‌గా కనిపిస్తున్నాడని ముఖేష్ అనగా.. ఝాన్సీ మాత్రం అందుకు భిన్నంగా స్పందించింది. అతను డల్‌గా ఉన్నా.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో గొడవ పెట్టుకోవాలనే ఆలోచన చేస్తుంటాడని చెప్పింది. బిగ్ బాస్ రెండో వారం ‘దశావతారం’లో భాగంగా ‘పవర్ ఆఫ్ పీపుల్స్’ ద్వారా కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ‘చిక్కకు.. దొరకకు’ అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న ఝాన్సీ, షాలినీ, ముఖేష్, రామ్‌ప్రసాద్, త్రిగుణ్ జైలులో ఉండాలి. మిగిలిన ఇంటి సభ్యులు జైలు బయట ఉండి.. జైలుకు ఎదురుగా ఏర్పాటు చేసిన గోడను దాటి కంటెండర్లు బయటకు రాకుండా అడ్డుకోవాలి. ఎవరైతే చివరి వరకు గార్డుల నుంచి తప్పించుకుని జైలు గోడను దాటి బయటకు వస్తారో.. వారు కెప్టెన్సీ టాస్క్ చివరి రౌండ్‌లో పాల్గొంటారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే గార్డులు పట్టుకున్న సమయంలో వారికి ప్రలోభాలు పెట్టవచ్చని, వారి డిమాండ్లను అంగీకరించి గార్డుల నుంచి తప్పించుకోవచ్చని కూడా వివరించాడు. టాస్క్ ప్రారంభమైన వెంటనే హౌస్‌లో అసలు గేమ్ మొదలైంది. ఎవరిని ఎలా అడ్డుకోవాలనే విషయంలో కంటెస్టెంట్లు ఒక్క పాయింట్‌పైకి రాలేకపోయారు. దీంతో గ్రూపులుగా విడిపోయి తమకు నచ్చిన విధంగా గేమ్ ఆడటం ప్రారంభించారు.మొదటి రౌండ్‌లో షాలినీ, ఝాన్సీని గార్డులు పట్టుకున్నారు. షాలినీని పట్టుకున్న వారిలో వర్షిణి.. ‘నువ్వు ఏజ్‌లో చిన్నదానివి.. కెప్టెన్సీని మేనేజ్ చేయలేవు’ అంటూ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఝాన్సీని పట్టుకున్నవారు పెట్టిన