Kaizer News

ప్రజల గడపే టీడీపీ..

ప్రజల గడపే టీడీపీ..

· National - India · prabhanews.com

సమస్యల పరిష్కారమే మా ఎజెండా టిడిపి జాతీయ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న 49వ డివిజన్‌లో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాం సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరుస్తాం ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం దివ్యాంగుడికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రతి డివిజన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటాం భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజల గడపే తెలుగుదేశం పార్టీ కార్యాలయమని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే తమ రాజకీయ అజెండా అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. 49వ డివిజన్‌లో శనివారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో నూర్‌భాషా కార్పొరేషన్‌ చైర్మన్‌ కే. నాగుల్‌ మీరాతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంలో కూర్చుని ప్రజల సమస్యలు తెలుసుకునే పార్టీ కాదని, ప్రజల గడప వద్దకే వెళ్లి వారి కష్టాలను తెలుసుకునే పార్టీ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే రాజకీయ బాధ్యతగా భావిస్తున్నామని వెంకన్న అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. 49వ డివిజన్‌ జైరామ్‌ వీధిలో నివసిస్తున్న దివ్యాంగుడు కొప్పురావూరు శ్రీనివాస్‌కు బుద్ధా వెంకన్న రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయం చేయడం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు

Original source: prabhanews.com
Read more on Kaizer News