కాఫీ దొంగతనం, ఫోన్‌పే, స్ప్రైట్ టాస్క్‌లు ఇంట్లో జరిగాయి. నిష్క్రియం కృష్ణుడు, సృష్టిని నాగ్ స్టోర్‌రూం పంపారు. మానిప్యులేటర్, పపెట్ ఆట; రాంప్రసాద్, షాలినికి శిక్షలు. నాగ్ రోహిత్ ఆటను ప్రశ్నించారు; షాలిని సేఫ్ అయ్యింది. Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10 రోజు రోజుకీ మంచి మంచి ఆసక్తికరంగా సాగుతుంది. ఈ రోజు సెప్టెంబరు 19వ తేదీ బిగ్‌బాస్ మొదలై 12వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నాగార్జున రావడం రావడమే శుక్రవారం ఏం జరిగిందో చూస్తారు. త్రిగుణ్ దేబ్‌జానీ కాఫీ పౌడర్ దొంగతనం చేస్తాడు. ఉదయం వంశీ, త్రిగుణ్, రాంప్రసాద్ కాఫీ తాగుతారు. దేబ్‌జానీ ఫీలవుతుందని రాంప్రసాద్ విషయం చెప్తేస్తాడు. రాంప్రసాద్ కూడా తీసుకున్నందుకు చాలా కోపంగా ఉందని దేబ్‌జానీ అంటుంది. తర్వాత ఫోన్‌పే ప్రమోషన్ టాస్క్‌గా రెండు కాయిన్స్‌ని ఇంట్లో ఎవరైనా ఇద్దరికి ఇవ్చొచ్చు అని బిగ్‌బాస్ కెప్టెన్‌కి చెప్పడంతో ఝాన్సీ ముకేశ్, రాంప్రసాద్‌లకు ఇస్తుంది. తర్వాత స్ప్రైట్ టాస్క్‌గా ట్రూత్ అండ్ స్పైస్ ఆడుతారు. ట్రూత్ ఇచ్చిన వాళ్లకి ప్రశ్న,, సైస్ వచ్చిన వాళ్లకి కారం తింటారు. ఈ గేమ్‌లో రోహిత్, త్రిగుణ్, చరణ్, షాలిని, అమన్, వర్షిణి, కృష్ణుడు టీమ్ గెలుస్తుంది. చరణ్, రోహిత్, షాలిని అర్థరాత్రి 12 గంటలకు మాట్లాడుకుంటారు. అమన్‌కి నీకు మధ్య ఏమైనా ఉందా అని చరణ్ షాలినిని అడుగుతాడు. లేదు అని షాలిని అంటుంది. తర్వాత రోహిత్‌తో ఏమైనా ఉందా అంటే లేదు అంటుంది. ఇద్దరితో అంత ఏం లేదు జస్ట్ ఫ్రెండ్స్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తా అని చరణ్‌తో అంటుంది. అయితే అమన్ కంటే రోహిత్ కొంచెం ఎక్కువ ఇష్టం అని అంటుంది. నాగ్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడి ఈ వారం చాలా చాలా ఎంజాయ్ చేశా.. 15 మంది ఉన్నారు కానీ నాకు కేవలం 13మందే కనిపించారు.. ఇద్దరు పూర్తిగా కనిపించడం లేదు., అని కృష్ణుడు, సృష్టికి సంబంధించిన వీడియో వేస్తారు. అందరూ అందరితో మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు, సృష్టి వేరుగా ఒంటరిగా ఉంటారు. నాగ్ ఇద్దరూ చాలా డిసప్పాయింట్ చేశారు అని చెప్పి ఇద్దరు మాస్క్‌మెన్స్‌ని ఇంటి లోపలికి పిలిచి ఇంట్లోని ఓ గ్లాస్ బ్రేయ్ చేయిస్తారు. మీ ఇద్దరూ గేమ్‌లో లేరు ప్రేక్షకులులా మారిపోయారు కాబట్టి మీ ఇద్దరూ ఇంట్లో ఉంటే అర్హత కోల్పోయారు అని ఇద్దరినీ స్టోర్ రూంకి పంపేస్తారు. ఝాన్సీ కెప్టెన్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పి గేమ్ బాగా ఆడుతున్నావని అంటారు. ఇక సృష్టి, కృష్ణుడిని స్టోర్‌రూంలో బ్రేక్ చేసిన గ్లాస్ వెనక కూర్చొమని చెప్పి ఈ రోజు కూడా ఇక్కడే ఉండండి అని అంటారు. తర్వాత త్రిగుణ్‌ని లేపి కాఫీ గురించి మాట్లాడి.. దేబ్‌జానీ గత వారం చెప్పిన సీక్రెట్ కంటే పెద్ద సీక్రెట్ చెప్పమని అంటారు. త్రిగుణ్ తన దెయ్యం ఉందని నమ్మంచే సీక్రెట్ టాస్క్ గురించి చెప్తాడు. ఇక రాంప్రసాద్ తనో సారి తాగి కారు నడిపి పోలీసులకు దొరికిపోయే టైంలో పరిచయం లేని ఓ వ్యక్తిని సాయం అడిగి అప్పటి నుంచి ఆయనతో ఫ్రెండ్ అయ్యానని అంటాడు. నాగ్ తాగి కారు బండీ ఏం నడపొద్దని అందరికీ చెప్తారు. ఇక త్రిగుణ్ ఒకే సారి