బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 31 సోమవారం బంగారం ధరలు తగ్గాయి. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లపై రూ.1,470 మేర ధర తగ్గింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా సోమవారం దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,470 మేర ధర తగ్గి.. రూ.1,56,470 గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.1,350 మేర ధర తగ్గి, రూ.1,43,700 గా ఉంది. అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,56,770, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,43,700 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,000 ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,770, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,43,700 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,60,000 ఉంది