Kaizer News

Pawan Kalyan | తిరుమ‌ల లడ్డులో జంతు కొవ్వు లేదని త

Pawan Kalyan | తిరుమ‌ల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ.. పవన్ కళ్యాణ్‌పై నెటిజ‌న్ల‌ విమర్శలు!

· Entertainment · ntnews.com

TTD Ghee of Animal Fat | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్ర శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యత వివాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సంయుక్తంగా జరిపిన సమగ్ర దర్యాప్తులో టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీకి వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు (Animal Fat) వాడినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. అయితే, ఈ విచారణలో నెయ్యి సరఫరాలో కొంత కల్తీ జరిగినట్లు మాత్రం అధికారులు నిర్ధారించారు. పంపిణీ చేసిన నెయ్యిలో కొద్దిపాటి రసాయనాలు (Chemicals) మరియు వృక్ష ఆధారిత పదార్థాలు (Vegetable Oils) వంటి కల్తీ పదార్ధాలు కలిపినట్లు దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. ఇక‌ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు చేసిన తీవ్ర ఆరోపణలు అవాస్తవమని తేలడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో వారిపై విమర్శల వర్షం కురుస్తోంది. సిట్ (SIT) దర్యాప్తులో నెయ్యిలో జంతు కొవ్వు వాడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవ్వడంతో, కేవలం రాజకీయ లబ్ది పొందేందుకు, ప్రత్యర్థులపై బురదజల్లే దురుద్దేశంతోనే అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారిని వివాదాల్లోకి లాగారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి పవిత్రతతో చెలగాటమాడి, కోట్లాది మంది హిందూ భక్తుల విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారంటూ నెటిజన్లు, సామాజిక వేత్తలు పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతల తీరును తప్పుపడుతున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News