Kaizer News

రెండో కుమార్తెకు జన్మనిచ్చిన దీపిక

రెండో కుమార్తెకు జన్మనిచ్చిన దీపిక

· Entertainment · ntnews.com

అగ్ర కథానాయిక దీపికా పడుకోన్‌ రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 2024 సెప్టెంబర్‌ 8న తొలి బిడ్డ ‘దువా’ జన్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా రెండేండ్ల తరువాత రెండో కుమార్తెకు ఆమె జన్మిచ్చారు. ఈ విషయాన్ని రణవీర్‌సింగ్‌, దీపిక పదుకోన్‌ దంపతులు అధికారికంగా తమ ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. ‘వెల్కమ్‌ బేబీ గర్ల్‌’ అంటూ చిన్నారి పాద ముద్రను చూపిస్తూ వారు పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులంతా రణవీర్‌, దీపిక జంటకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు అభినందనలతో కూడిన సందేశాలను అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న దీపిక తన రెండవ గర్భం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే

Original source: ntnews.com
Read more on Kaizer News