ఒకప్పుడు తన వేగంతో ప్రపంచంలోని స్టార్ బ్యాటర్లను హడలెత్తించిన భారత మాజీ పేసర్.. ఇప్పుడు మాత్రం సామాన్య ప్రయాణికుడిలా మెట్రోలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అతడెవరో కాదు.. భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జవగళ్ శ్రీనాథ్. ట్రాలీ బ్యాగ్‌తో బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న ఆయన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని ‘నమ్మ మెట్రో’లో జవగళ్ శ్రీనాథ్ సాధారణ ప్రయాణికుడిలా కనిపించారు. నీలం రంగు జీన్స్, లేత నీలం రంగు షర్ట్ ధరించిన ఆయన.. చేతిలో ట్రాలీ బ్యాగ్‌తో మెట్రోలో నిల్చున్నారు. చెవులకు ఇయర్‌బడ్స్ పెట్టుకుని తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. ఎక్కువమంది చదివినది: IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..! ఆ సమయంలో ఓ అభిమాని శ్రీనాథ్‌ను గుర్తించి ఫొటో తీసుకున్నాడు. ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. స్టార్ క్రికెటర్ అయినప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రజా రవాణాలో ప్రయాణించడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫొటో ఎప్పుడు తీశారన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఇటీవల కాలంలో తీసినదిగానే కనిపిస్తోంది. జవగళ్ శ్రీనాథ్ భారత క్రికెట్‌లో సుదీర్ఘకాలం సేవలందించిన గొప్ప పేసర్లలో ఒకరు. 1992, 1996, 1999, 2003 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ వేదికపై నాలుగు ఎడిషన్లలో కలిపి 44 వికెట్లు పడగొట్టారు. 1990లలో తన పదునైన పేస్, బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందులకు గురిచేసేవారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 296 మ్యాచ్‌లు ఆడి 551 వికెట్లు సాధించారు. ఇందులో 13 సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం, ఒకసారి మ్యాచ్‌లో 10 వికెట్లు సాధించడం విశేషం. భారత్ తరఫున 229 వన్డేల్లో 315 వికెట్లు తీసిన శ్రీనాథ్.. 300కు పైగా వన్డే వికెట్లు సాధించిన ఏకైక భారత పేసర్‌గా నిలిచారు. వన్డేల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నారు. శ్రీనాథ్ 67 టెస్టుల్లో 121 ఇన్నింగ్స్‌లు ఆడి 236 వికెట్లు సాధించారు. టెస్టుల్లో 10 సార్లు ఐదు వికెట్లు పడగొట్టారు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ శ్రీనాథ్ ఉపయోగకరమైన ఆటగాడే. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన మొత్తం 1,892 పరుగులు సాధించారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా శ్రీనాథ్ ఆటకు దూరం కాలేదు. ప్రస్తుతం ఆయన ఐసీసీ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు అధికారిగా వ్యవహరిస్తూ క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. స్టార్ క్రికెటర్లు సాధారణంగా బయటకు వచ్చినప్పుడు ప్రత్యేక వాహనాలు, భద్రతా సిబ్బందితో కనిపిస్తుంటారు. కానీ శ్రీనాథ్ మాత్రం అందుకు భిన్నంగా ప్రజా రవాణాను ఉపయోగించడం అభిమానులను ఆకట్టుకుంది. ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..! బెంగళూరులోని జయనగర్‌లో నివసించే శ్రీనాథ్.. తన వ్యక్తి