Kaizer News

భాష రాదని ఆపలేదు.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం

భాష రాదని ఆపలేదు.. ఆటో డ్రైవర్ వినూత్న ప్రయోగం

· National - India · sakshi.com

ముంబై: మహారాష్ట్రలో ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష నేర్చుకోవడం తప్పనిసరని అక్కడి ప్రభుత్వం ఇటీవల నిబంధన తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. ఓ వైపు మరాఠీ భాష నేర్చుకుంటూనే మరోవైపు ప్రయాణికులతో మెరుగ్గా కమ్యూనికేట్‌ చేసేందుకు తన ఆటోలో హిందీ నుంచి మరాఠీకి అనువదించిన చేతిరాత నోటును అతికించుకున్నారు. భాష కోసమై ఆటో డ్రైవర్‌ చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షీట్‌లో ప్రయాణికులతో రోజువారీ సంభాషణల్లో ఉపయోగించే సాధారణ హిందీ పదాలు, వాక్యాలను వాటి మరాఠీ అనువాదాలతో ఈ షీట్‌లో రాసి ఉంచారు. మరాఠీ నేర్చుకుంటున్న ఆటో డ్రైవర్‌.. ప్రయాణికులతో మాట్లాడే సమయంలో అవసరమైన వాక్యాలను చూసుకుని ఉపయోగించుకునేలా ఈ షీట్‌ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో నిత్యం ఎదురయ్యే సాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ షీట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలా ప్రయాణికులతో రోజువారీ సంభాషణల్లో అవసరమయ్యే పలు సాధారణ వాక్యాలను హిందీతో పాటు వాటి మరాఠీ అనువాదాలతో ఈ షీట్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం మరాఠీ నేర్చుకుంటున్న వ్యక్తికి ప్రయాణికులతో మాట్లాడే సమయంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉండేలా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు సదరు ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషపై ప్రాథమిక స్థాయిలో అవగాహన ఉండాలని నిబంధన తీసుకొచ్చింది. అంటే పూర్తి స్థాయిలో మరాఠీ చదవడం, రాయడం లేదా ఫ్లూయెంట్‌గా మాట్లాడడం తప్పనిసరి అని కాదు ప్రయాణికులతో సాధారణ సంభాషణ చేయగలిగేంత మరాఠీ భాష రావాలి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర రవాణా శాఖ అధికారిక సైట్‌లో 2026లో మోటార్ వెహికల్ రూల్స్‌కు చేసిన సవరణలు సైతం నమోదు చేసింది. షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News