ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ విస్తరణ బాట పట్టింది. ఇటీవల ఐపీవోకి వచ్చిన సంస్థ..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 60కి పైగా షోరూమ్‌లను నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో మరో 110కి పైగా నూతన షోరూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో షోరూమ్‌లను నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో ఉత్తర భారతంలో కూడా ప్రవేశించడానికి కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించారు