పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు : --> Add as a preferred source on google Gold and Silver Today: వరుసగా పెరుగుతూ సామాన్యులతో పాటు.. మధ్యతరగతి ప్రజలకు కూడా అందని ద్రాక్షలా మరుతోన్న బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. ఈ రోజు బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాములపై రూ.2,890 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,240కి దిగివచ్చింది.. ఇక, రూ.2,650 తగ్గి రూ.1,45,050కి చేరుకుంది 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,170 తగ్గి.. రూ.1,18,680కి పరిమితమైంది.. మరోవైపు.. కిలోపై రూ.5 వేలు తగ్గడంతో కిలో వెండి ధర రూ..2.60 లక్షలకు చేరింది.. మొత్తంగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో రోజువారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 28తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.289 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.265, 18 క్యారెట్ల ధర రూ.217 చొప్పున తగ్గినట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లలో కొంతకాలంగా నెలకొన్న ఆందోళన తగ్గడంతో బంగారం, వెండి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. అయితే 15 శాతం అధిక పన్ను రేట్లు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు విలువైన లోహాల మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ధరల్లో రోజువారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నగరాల వారీగా బంగారం ధరలు ఆగస్టు 29న వివిధ నగరాల్లో 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి: చెన్నైలో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.15,824.. 22 క్యారెట్ల ధర రూ.14,505.. 18 క్యారెట్ల ధర రూ.12,275 ముంబైలో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.15,824.. 22 క్యారెట్ల ధర రూ.14,505.. 18 క్యారెట్ల ధర రూ.11,868 ఢిల్లీలో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.15,839.. 22 క్యారెట్ల ధర రూ.14,520.. 18 క్యారెట్ల ధర రూ.11,883 కోల్‌కతాలో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.15,824.. 22 క్యారెట్ల ధర రూ.14,505.. 18 క్యారెట్ల ధర రూ.11,868 బెంగళూరులో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.15,824.. 22 క్యారెట్ల ధర రూ.14,505.. 18 క్యారెట్ల ధర రూ.11,868 హైదరాబాద్‌లో ఒక గ్రాము 24 క్యారెట్ల ధర రూ.15,824.. 22 క్యారెట్ల ధర రూ.14,505.. 18 క్యారెట్ల ధర రూ.11,868 మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హోర్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని పేర్కొంది. ఈ జలమార్గానికి సంబంధించి అమెరికా అధికారులు చేస్తున్న ప్రకటనలు ప్రపంచ చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించినవని ఇరాన్ ఆరోపించింది. అయితే అమెరికా వైట్‌హౌస్ మాత్రం హోర్ముజ్ జలసంధిపై తమ నౌకాదళ దిగ్బంధం పూర్తిగా అమల్లో ఉందని తెలిపింది. జలసంధి ప్రస్తుతం తెరిచి, స్వేచ్ఛగా ఉందని, అక్కడ ఎలాంటి మైన్లు లేవని పేర్కొంది. అలాగే టెహ్రాన్‌తో అమెరికా ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ చమురు మార