Kaizer News

భీకర వరదను తట్టుకుని నిలబడిన ఇల్లు .. ఎలా సాధ్యమైం

భీకర వరదను తట్టుకుని నిలబడిన ఇల్లు .. ఎలా సాధ్యమైంది?

· International · tv9telugu.com

ఆ మిరాకిల్ హౌస్ పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ ఇల్లు అంతటి భీకర వరద ప్రవాహాన్ని ఎలా తట్టుకుందనే విషయమై నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 26న టిబెట్-నేపాల్‌‌ బోర్డర్‌లో ఊహించని విధంగా దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చింది. మరణించిన వారి సంఖ్య 734కు చేరగా మరో 2,498 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. నేపాల్ విపత్తుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా వేగంతో బురదతో నిండిన నీటి ప్రవాహం.. గ్రీన్ కలర్ పెయింట్ వేసిన ఆ ఇంటి వెనుక నుంచి దూసుకెళ్లగా.. వరదలో కొంత భాగం ఆ ఇంటి ముందు నుంచి వెనక్కి మళ్లిన దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. ఇంట్లోని వారు రెండవ అంతస్థులోని బాల్కనీ నుంచి వరద ప్రవాహాన్ని చూస్తూ ఉండిపోయారు. అనంతరం స్థానికులు, సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భీకరంగా దూసుకొచ్చిన వరద ఆ ఇంటిని చుట్టుముట్టినా ఆ ఇల్లు ఎలా తట్టుకుందనే విషయం పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో గదులు కొట్టుకుపోయాయనీ కొందరంటే.. నేపాల్ లో ఇంటి నిర్మాణానికి స్టీలు, కాంక్రీట్ ఉపయోగించరని వరద ధాటికి అవన్నీ కొట్టుకుపోయాయనీ కొందరు ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. కొందరు దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే బలంగా తట్టుకుని నిలబడ్డ ఇంటి గోడ ఆ తర్వాత కూలిందని సోషల్ మీడియాలో మరిన్ని పోస్టులను చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంటిని నిర్మించిన ఇంజినీర్ కి చేతులెత్తి దణ్ణం పెట్టాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజంగా గొప్పవాడని ప్రశంసిస్తున్నారు. వరద ప్రవాహం ఆ ఇంటి వెనక భాగం వైపు దూసుకురాలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసారు. వరద తీవ్రత డైరెక్ట్ గా ఇంటిపై పడకుండా పక్కనే ఉన్న మరో ఇల్లు, చెట్టు అడ్డుకున్నాయని.. ఆ పక్కన ఇల్లు కూలిపోయిన తర్వాత దాని శిథిలాలు వరదకు ఆటంకంగా ఏర్పడి ఈ ఇల్లు కూలకుండా కాపాడాయని మరికొందరు రాసుకొచ్చారు. మధ్యలో అడ్డంకి ఉన్నప్పుడు వరద ప్రవాహం రెండుగా చీలిపోయి.. మధ్యలో ఉన్న ప్రాంతంపై తీవ్రత తగ్గుతుందని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఫిజిక్స్ సిద్ధాంతాలను గుర్తుచేసారు. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త భవనం కావడం, కాంక్రీటు, స్టీలుతో బలమైన పునాది ఉండటం, వరద ప్రవాహం ఆ ఇంటికి నేరుగా తాకకుండా కొంత సమయం పాటు పక్కన ఉన్న ఇల్లు అడ్డుకోవడం .. వీటన్నిటితో పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు కొంత అదృష్టం కలిసి రావడంతో వాళ్లు బతికారు అని మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలియచేసాడు. ఆ ఇంటికి రెండు వైపులా ఆనుకుని ఉన్న ఇళ్లు వరద ప్రవాహ తీవ్రతను ఆ ఇంటిపై పడకుండా చాలా వరకు అడ్డుకున్నాయి. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో ఇంజినీర్ శ్రద్ధ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఒక వేళ ఆ ఇల్లు చివర్లో ఉండి ఉంటే.. వరదను తట్టుకోవడం కష్టమయ్యేదని మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంక్రీటు, స్టీలు ఫ్రేమ్ తో కట్టిన ఇల్లు కావడంతో ఆ ఇల్లు తట్టుకొని నిలబడిందా లేక మరో కారణమా? తెలుసుకుంటే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో అలాంటి కట్టడాలను నిర్మిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందన

Original source: tv9telugu.com
Read more on Kaizer News