Kaizer News

Bigg Boss 10 Weekend Episode : షాలినికి గట్టిగా ఇచ

Bigg Boss 10 Weekend Episode : షాలినికి గట్టిగా ఇచ్చిపడేసిన నాగార్జున.. హౌస్ లో మ్యానిప్యులేటర్, పప్పెట్స్ ఎవరు..? బిగ్ బాస్ 10 ‘డే 13’ వీకెండ్ ఎపిసోడ్..

· Entertainment · 10tv.in

నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి కెప్టెన్ గా ఝాన్సీ గెలిచింది. నేడు వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆడియన్స్ తో మాట్లాడారు. తర్వాత హౌస్ లో జరిగింది చూపించారు. వంశీ, త్రిగున్ కాఫీ తాగుతూ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. త్రిగున్ దేబ్జానీ కాఫీ దొంగిలించి రామ్ కి కూడా ఇచ్చాడు. రామ్ ఈ విషయాన్ని దేబ్జానికి చెప్పేసాడు. దీంతో త్రిగున్ వచ్చి దేబ్జానీ తో మాట్లాడాడు. అనంతరం గోల్డ్ కాయిన్స్ టాస్క్ ఇచ్చి కెప్టెన్ ఎవరికైనా ఇద్దరికి గోల్డ్కీ కాయిన్స్ ఇవ్వొచ్చు అని చెప్పారు. సీజన్ అయిపోయేలోపు ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్లకు ఒక సర్ ప్రైజ్ ఇస్తామన్నారు బిగ్ బాస్. దీంతో ఝాన్సీ ముకేశ్ కి ఒకటి, రామ్ ప్రసాద్ కి ఒకటి ఇచ్చారు. అనంతరం ట్రూత్, స్పైస్ గేమ్ ఆడారు. ట్రూత్ వస్తే సంచాలక్ అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా చెప్పాలి. స్పైస్ వస్తే అక్కడ ఉన్న స్పైసి ఫుడ్ తినాలి. ఇద్దరిద్దరు ఒకేసారి ఆడారు. దీనికి వంశీ సంచాలక్ గా వ్యవహరించారు. . రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి మొదట సుధీర్-అమన్ ఆడగా సుధీర్ కి ట్రూత్ వస్తే హౌస్ లో మ్యానిప్యులేటర్ ఎవరు అంటే త్రిగున్ అని చెప్పాడు. అమన్ స్పైస్ ఫుడ్ తిన్నాడు. తర్వాత ఝాన్సీ-షాలిని ఆడగడా ఝాన్సీ కి ట్రూత్ వచ్చింది. మొదట ఫ్రెండ్ అనుకున్నావు కానీ ఇప్పుడు కాదు అనేవాళ్ళు ఎవరు అని అడగ్గా త్రిగున్ అని చెప్పింది. షాలిని స్పైస్ ఫుడ్ తింది. ముకేశ్-త్రిగున్ ఆడగా ముకేశ్ కి ట్రూత్ వస్తే హౌస్ లో రెండు ఫేస్ లు ఉన్నది ఎవరు అంటే త్రిగున్, షాలిని అని చెప్పాడు. త్రిగున్ స్పైస్ ఫుడ్ తిన్నాడు. నరేష్-చరణ్ ఆడగా నరేష్ కి ట్రూత్ వస్తే ఎవరితో ఎక్కువ గొడవ పడతావు అవసరం లేకపోయినా అని అడగ్గా షాలినితో అని చెప్పాడు. చరణ్ స్పైస్ ఫుడ్ తిన్నాడు. వర్షిణి-సృష్టి ఆడగా వర్షిణికి ట్రూత్ వస్తే హౌస్ లో ఇరిటేటింగ్ పర్సన్ ఎవరు అని అడగ్గా త్రిగున్ అని చెప్పింది. సృష్టి స్పైస్ ఫుడ్ తింది. అనంతరం రోహిత్, షాలిని ఇక తమ గ్రూప్ ముచ్చట్లు పెట్టుకున్నారు. రోహిత్ అంటే ఇష్టమని షాలిని చెప్పింది. అనంతరం నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. రాగానే ఈ వారం కృష్ణుడు, సృష్టి అసలు యాక్టివ్ గా లేరు అని వీడియోస్ చూపించాడు నాగార్జున. ఇందుకు గాను కృష్ణుడు, సృష్టి లను స్టోర్ రూమ్ లో కూర్చొని ఈ వీకెండ్ అంతా అక్కడనుంచే చూడండి. ఈ రెండు రోజులు మీరు హౌస్ మేట్స్ కాదు అని పనిష్మెంట్ ఇచ్చాడు నాగ్. ఆ తర్వాత ఝాన్సీ కెప్టెన్ అయినందుకు అభినందించాడు. అనంతరం త్రిగున్ దేబ్జానీ కాఫీ దొంగలించిన విషయం అడిగాడు నాగార్జున. కాఫీ దొంగలించినందుకు త్రిగున్, రామ్ ప్రసాద్ లను సీక్రెట్ చెప్పమన్నాడు. త్రిగున్ బిగ్ బాస్ ఇచ్చిన దయ్యం టాస్క్ చెప్పాడు. త్రిగున్ దయ్యం టాస్క్ ఫెయిల్ అయ్యావు అని నాగార్జున అన్నాడు. ఇంకోటి చెప్పమంటే త్రిగున్ ఒకప్పుడు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు ఒకరికి తెలియకుండా ఒకర్ని మెయింటైన్ చేసేవాడ్ని అని సీక్రెట్ చెప్పాడు. ఇక రామ్ ప్రసాద్ ని సీక్రెట్ చెప్పమంటే నాలుగేళ్ళ క్రితం డ్రంక్ & డ్రైవ్ చెకింగ్ లో దొరికేవాడ్ని కానీ కార్ వేరే వాళ్ళకు ఇచ్చి ముందుకు తీసుకు రమ్మని హెల్ప్ అడిగాను అతను తెచ్చారు. అప్పట్ను

Original source: 10tv.in
Read more on Kaizer News