Kaizer News

ప్రజల కష్టాల బాట.. పోలీసుల కాసుల వేట

ప్రజల కష్టాల బాట.. పోలీసుల కాసుల వేట

· City - Hyderabad · ntnews.com

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రోజురోజుకూ నరకాన్ని తలపిస్తున్నది. శుక్రవారం రాఖీ పండుగ వేళ.. రద్దీ మరింత పెరిగిపోవడంతో వాహనదారుల బాధలు రెట్టింపయ్యాయి. నగర ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో ఒకదానిని ఆనుకొని మరొకటి మెల్లగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నారపల్లి-ఉప్పల్‌ ప్రాంతంలోప్రయాణికులు చుక్కలు చూశారు. ఇంతలా ప్రజలు కష్టాల ‘దారి’లో ప్రయాణించినా..వాహనాలను క్రమబద్ధీకరించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం కాసుల వేటలో బిజీబిజీగా గడిపారు. ట్రాఫిక్‌ నియంత్రణ కంటే చలాన్ల వసూళ్లకే పరిమితమయ్యారు. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు

Original source: ntnews.com
Read more on Kaizer News