Kaizer News

Water Tanker Rate: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. పెర

Water Tanker Rate: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. పెరగనున్న వాటర్ ట్యాంకర్ చార్జీలు!

· City - Hyderabad · 10tv.in

> Water Tanker Rate: హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరా చేసే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ధరలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంద్ హెచ్చరికలు జారీ చేసిన జలమండలి ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధులు, జలమండలి(Water Tanker Rate) మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో ప్రతిపాదిత సమ్మె నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. నగరవాసుల తాగునీటి అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటర్ ట్యాంకర్ సేవలన్నీ యథావిధిగా కొనసాగిస్తామని, రేట్ల పెంపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తామని అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. Rahul Gandhi: లక్ష స్కూళ్లను మూసేశారు.. ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు.. ఇండోర్‌ సభలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ నాయకుడు నాయుడు మాట్లాడుతూ.. 2017లో నిర్ధారించిన పాత ధరలే ఇప్పటికీ అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్ల కాలంలో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో పాటు వాహనాల మెయింటెనెన్స్, డ్రైవర్ల వేతనాలు, పన్నులు గణనీయంగా పెరిగాయని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ట్యాంకర్‌కు రూ.400 మేర ధర పెంచితేనే నిర్వహణ వ్యయం వర్కౌట్ అవుతుందని కోరగా, తదుపరి బోర్డు సమావేశంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎండీ హామీ ఇచ్చారు. రేట్ల సవరణకు సంబంధించిన ఆమోద ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేసి, తుది నిర్ణయం కోసం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని జలమండలి ఎండీ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ప్రస్తుతానికి సమ్మె ఆలోచనను పక్కనబెట్టామని అసోసియేషన్ ప్రకటించింది. అయితే ప్రభుత్వం రేట్ల పెంపుకు ఆమోదం తెలిపితే, రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాటర్ ట్యాంకర్ సర్వీసుల భారం వినియోగదారులపై పడటం ఖాయంగా కనిపిస్తోంది

Original source: 10tv.in
Read more on Kaizer News