Kaizer News

Tarnaka: భూ దోపిడీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ

Tarnaka: భూ దోపిడీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలి: ఎస్పీ

· City - Hyderabad · hmtvlive.com

Shorts తార్నాక: తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగినట్లు ఆరోపిస్తున్న భూ దోపిడీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిషన్‌ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ డిమాండ్‌ చేసింది. తార్నాక లోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎస్‌. సింహాద్రి యాదవ్‌ మాట్లాడుతూ ఈ నెల 16న అసెంబ్లీలో ప్రభుత్వం ఆధారాలతో వెల్లడించిన వివరాల ప్రకారం బీఆర్‌ఎస్‌ నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల పేర్లతో రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల భూములు ఉన్నట్లు ప్రకటించిందని పార్టీ నాయకులు తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పేర్లపై 295 ఎకరాలు ఉండగా సుమారు 700 ఎకరాలకు కంచె వేసి సాగు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించిందని పేర్కొన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో జరిగినట్లు ఆరోపిస్తున్న భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన రాజకీయ నాయకులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా కబ్జా చేసినట్లు తేలిన భూములను స్వాధీనం చేసుకుని అమరవీరుల కుటుంబాలు, పేదలు, దళితులు, తెలంగాణ ఉద్యమకారులు, వెనుకబడిన తరగతులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల శ్రీనివాసులు, మహమ్మద్‌ రిజ్వాన్‌ హుస్సేన్‌,మహమ్మద్‌ వాజిద్‌ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News