Kaizer News

కర్ణాటకలో ఐఏఎస్‌ అధికారి గంగ్వార్‌ అరెస్ట్‌

కర్ణాటకలో ఐఏఎస్‌ అధికారి గంగ్వార్‌ అరెస్ట్‌

· National - India · sakshi.com

బెంగళూరు: కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్‌సీ) నిర్వహించిన వెటర్ననీ ఉద్యోగుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్ర గంగ్వార్‌ను ఆదివారం సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌ కోరనున్నారు. ఈ కేసులో సీఐడీ అధికారులు గంగ్వార్‌ను శుక్ర, శనివారాల్లో విచారణ జరిపారు. అయితే, విచారణకు ఆయన సహకరించడం లేదని కస్టడీలోకి తీసుకున్నారు. 2024–2026 సంవత్సరాల్లో గంగ్వార్‌ కేపీఎస్‌సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఈడీ గంగ్వార్‌ నివాసాల్లో తనిఖీలు జరిపింది. ఇటీవల గంగ్వార్‌ కనిపించకుండా పోయారంటూ వచి్చన వార్తలు సంచలనం రేపాయి. అయితే, గంగ్వార్‌ తన తండ్రికి సీరియస్‌గా ఉండటంతో సొంతూరు వెళ్లారంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే వివరణ ఇవ్వడం గమనార్హం. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News