Kaizer News

viral video: బస్సు నుంచి కింద పడిపోతుండగా వృద్ధుడి

viral video: బస్సు నుంచి కింద పడిపోతుండగా వృద్ధుడిని కాపాడిన క్లీనర్..

· National - India · telugu.oneindia.com

కేరళలోని కన్నూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వృద్ధుడు ప్రైవేట్ బస్సు ఎక్కుతుండగా అదుపుతప్పి కిందకు పడబోయాడు. అంతలోనే దేవుడిలా వచ్చిన ఆ బస్సు క్లీనర్ చాకచక్యంగా వృద్ధుడిని కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆపదలో దేవుడిలా వచ్చి ఆ వృద్ధుడిని కాపాడిన క్లీనర్ పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ క్లీనర్ చూపిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కేరళలోని కుట్టియట్టూరు- కన్నూర్ మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు ఓ స్టేజీ వద్ద ఆగగానే ఓ వృద్ధుడు బస్సు ఎక్కాడు. అయితే ఆ వృద్ధుడు ఎక్కేలోపే డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దాంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయిన వృద్ధుడు కిందపడిపోయాడు. వెంటనే బస్సులో ఉన్న అతుల్ అనే క్లీనర్ సమయస్ఫూర్తితో స్పందించి ఆ వృద్ధుడు కింద పడకుండా కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే సరైన టైమ్ లో స్పందించి వృద్ధుడిని కాపాడటంతో అతుల్‌ పై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లీనర్ క్షణం ఆలస్యం చేసినా ఆ వృద్ధుడు బస్సు కింద పడిపోయేవాడు. సమయానికి స్పందించి వృద్ధుడిని కాపాడడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్లీనర్ దేవుడి రూపంలో సాయం చేశాడుగా.. అంటూ కామెంట్ పెడుతున్నారు. అలాగే మరి కొందరు మాత్రం బస్సు ఎక్కే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ.. ఇంకొందరు మాత్రం రకరకాల ఈమోజీలతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటివరకూ 1200 కు పైగా లైక్‌ లు, లక్షకు పైగా వ్యూస్‌ ను సొంతం చేసుకుంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News