Irumudi: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. భావోద్వేగాలు, సామాజిక కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడమే కాకుండా, ఊహించని రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష ఆదరణతో ఈ సినిమా మైలురాళ్లను అధిగమిస్తోంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల జోరు చూస్తుంటే, మరో 2-3 రోజుల్లోనే ఈ మూవీ సునాయాసంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాంగ్ రన్‌లో ఈ సినిమాకు రూ. 300 కోట్ల టార్గెట్ ఎదురుగా ఉంది. ఇదే రన్ మరికొన్ని రోజులు కొనసాగితే, టాలీవుడ్ రీజినల్ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర మరియు సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఎమోషనల్ అండ్ సెన్సిబుల్ కథలతో అలరించే శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తన మార్కు రొటీన్ మాస్ ఎలిమెంట్స్‌కు భిన్నంగా, ఒక బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో రవితేజ చూపించిన నటన ఈ చిత్ర విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. టోటల్ రన్ ముగిసేసరికి ‘ఇరుముడి’ ఇంకెన్ని సరికొత్త రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది