Kaizer News

ఒక్క రోజైతే నీట్ పరీక్ష.. హైదరాబాద్లో ఎంబీబీఎస్ స

ఒక్క రోజైతే నీట్ పరీక్ష.. హైదరాబాద్లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎంత పనిచేసిందంటే

· City - Hyderabad · v6velugu.com

ఒక్క రోజైతే నీట్ పరీక్ష.. గంటలు గడిస్తే పరీక్ష రాయాల్సిన ఎంబీబీఎస్ విద్యార్థిని.. ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. 2026 ఆగస్టు 29న హైదరాబాద్ లో వైద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ అపరాజిత హాస్టల్లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి ప్రాణాలు తీసుకుంది. 2026 ఆగస్టు 30న నీట్ పీజీ పరీక్ష అనగా.. ఎంబీబీఎస్ స్టూడెంట్ చనిపోవడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్నూలుకు చెందిన MBBS విద్యార్థిని యశ్విత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతోంది. పరీక్షల మానసిక ఒత్తిడే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్వితగా గుర్తించారు. ఒక్కగానొక్క కూతురు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Original source: v6velugu.com
Read more on Kaizer News