పేద మహిళపై దౌర్జన్యానికి నిరసనగా బీఆర్‌ఎస్ బంద్ కోదాడ అర్బన్, ఆంధ్రప్రభ : కోదాడ పట్టణంలోని 32వ వార్డులో పాన్ డబ్బా నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళ గంధం కనకమహాలక్ష్మిపై కోదాడ సీఐ శంకర్‌నాయక్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోరారు. ఆదివారం కోదాడ పట్టణంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా ప్రజలను కలిసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పేద మహిళపై దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదని, ప్రజల హక్కులను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కనకమ్మకు న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పిలుపునిచ్చారు