Kaizer News

Osmania University: ఓయూలో ప్రభుత్వ విప్ ఆది శ్రీని

Osmania University: ఓయూలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బర్త్‌డే వేడుకలు

· City - Hyderabad · hmtvlive.com

Shorts ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆది శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు, వేములవాడ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు తీసుకురావడం అభినందనీయమన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి, ఫోర్‌వే రోడ్డు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పేదలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఆది శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు రమేష్, ఓంకార్, మహేష్, రాజేందర్, స్వామిరాజు, చరణ్, అరుణ్, అఖిల్, విజయ్, శ్రీను, రాము, ప్రవీణ్, సురేష్, ఆంజనేయులు, సంతోష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News