Kaizer News

స్టార్‌ హీరోల సీక్వెల్స్.. ఊహించని విధంగా డిజాస్టర

స్టార్‌ హీరోల సీక్వెల్స్.. ఊహించని విధంగా డిజాస్టర్స్..!

· Entertainment · sakshi.com

ప్రస్తుతమున్న సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ అనే పదం కామన్ అయిపోయింది. కానీ ప్రతి సినిమాకు కొనసాగింపుగా ఎడాపెడా సీక్వెల్స్‌ తీసేస్తున్నారు. పార్ట్-1 సక్సెస్ అయినంత ఈజీగా.. సీక్వెల్ ఆదరిస్తారని భ్రమలో ఉన్నారు మేకర్స్. పెద్ద హీరోల సినిమాలకు సీక్వెల్‌ తీయడం అంత సులువేమి కాదు. మొదటి పార్ట్‌కు ఉన్నంత ఆదరణ వస్తుందో లేదో చెప్పలేం. ఏదైనా తేడా కొట్టిందంటే మొదటికే మోసం వస్తుంది. అలా ఇటీవల కాలంలో రిలీజైన అగ్రహీరోల సినిమాల సీక్వెల్స్ సైతం బాక్సాఫీస్ వద్ద బోక్కబోర్లా పడ్డాయి. అవేంటో మనం కూడా ఓ లుక్కేద్దాం. కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం సర్దార్‌ 2. గతంలో వచ్చిన సర్దార్ మూవీకి సీక్వెల్‌గా తెరక్కిక్కించారు. ఈ మూవీలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌జే సూర్య విలన్‌ పాత్రపోషించారు. ప్రిన్స్ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. సీక్వెల్ సక్సెస్ అవుతుందని భావించిన నిర్మాతలకు నిరాశే ఎదురైంది. కమల్‌ హాసన్ భారతీయుడు అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించింది. అదే కాన్ఫిడెన్స్‌తో ఇండియన్-2 నిర్మించారు మేకర్స్. శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సీక్వెల్ 2024లో రిలీజైంది. ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. మొదటి ఏడు రోజుల్లో ఇండియన్‌-2 సినిమాకు దేశవ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. అలా భారీ అంచనాలలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమై డిజాస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ యుద్ధంలో వార్‌-2 ఫెయిల్.. గతంలో సూపర్‌హిట్‌గా నిలిచిన బాలీవుడ్ మూవీ వార్. ఈ మూవీకి సీక్వెల్‌గా వార్-2 తెరెకెక్కించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్‌ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. సీక్వెల్‌పై గంపెడాశలు పెట్టుకున్న నిర్మాతలకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ హీరో బాలయ్య నటించిన హిట్ మూవీ అఖండ. మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో సీక్వెల్‌ తెరకెక్కించారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్‌ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. రోటీన్ రొడ్డకొట్టుడు కంటెంట్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. సీక్వెల్‌తో సక్సెస్ కొడదామనుకున్న మేకర్స్‌కు అఖండ-2 షాకింగ్ ఫలితాన్నిచ్చింది. టాలీవుడ్‌లో మరో మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ పోతినేని. గతంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్‌ టాలీవుడ్ అభిమానులను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పార్ట్-1 హిట్ కొట్టామన్న కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇది కాస్తా బెడిసికొట్టింది. అదే రోటీన్ కంటెంట్ ఉండడంతో అభిమానులు మొహం చాటేశారు. దీంతో సీక్వెల్‌తో సత్తా చాటుదామనుకున్న మేకర్స్‌కు నిరాశే ఎదురైంది. ఇలా హిట్‌ అయిన ప్రతి సినిమాకు సీక్వెల్‌ తీసుకుంటే పోతే రిజల్ట్‌ తేడా రావడం ఖాయంగా కనిపిస్తోంది. రోటీన్ కంటె

Original source: sakshi.com
Read more on Kaizer News