Kaizer News

Jailer 2 | మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. వీడియోతో సర్

Jailer 2 | మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. వీడియోతో సర్పైజ్‌ ఇచ్చేసిన మేకర్స్!

· Entertainment · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నైల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి ప్రముఖ నటి విద్యాబాలన్ సంబంధించిన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్‌ వీడియో విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘కాంత’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళంలో రజనీకాంత్ కాంబినేషన్‌లో విద్యాబాలన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. తెరపై రజనీకాంత్‌, విద్యబాలన్‌ కాంబో ఎలా ఉండబోతుందో అని ఆసక్తి పెరిగిపోయింది. మొదటి భాగంలో క్యామీయోస్‌ వచ్చినట్టుగానే సెంకడ్‌ పార్ట్‌ లో బిగ్‌ స్టార్ క్యామీయోస్‌ ఉన్నాయని.. సినివర్గాల్లో టాక్‌ నడుస్తుంది. కాగా ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, ఎస్‌.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News