Kaizer News

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎ

Hyderabad: హైదరాబాద్‌‌లో నైట్‌ షిఫ్ట్‌.. మన నగరం ఎంత వరకు సేఫ్..

· City - Hyderabad · tv9telugu.com

హైదరాబాద్‌ ఇప్పుడు పగలు మాత్రమే పనిచేసే నగరం కాదు. రాత్రి కూడా పరుగులు తీస్తున్న నగరం.. ఐటీ, బీపీవో, ఆస్పత్రులు, హోటళ్లు, ఎయిర్‌పోర్ట్‌, డెలివరీ, సెక్యూరిటీ వంటి రంగాల్లో వేలమంది రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత కూడా ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటకు వస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో నైట్‌ బస్‌ సర్వీసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆరు ప్రధాన మార్గాల్లో బస్సులు నడిపే ప్రణాళిక ఉంది. తొలి దశలో 15 బస్సులతో ప్రారంభించి స్పందనను బట్టి సర్వీసులు పెంచే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులపై నగరవ్యాప్తంగా ఖచ్చితమైన అధికారిక లెక్క ప్రస్తుతం లేదు. ఐటీ, ఐటీఈఎస్‌, బీపీవో, హెల్త్‌కేర్‌, హాస్పిటాలిటీ, డెలివరీ, సెక్యూరిటీ రంగాలను కలిపి చూస్తే సంఖ్య పెద్దదే. వీరిలో చాలామందికి కంపెనీ క్యాబ్‌లు, ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలు, సొంత వాహనాలే ప్రధాన రవాణా మార్గాలుగా ఉన్నాయి. ఇక మెట్రో వేళలు కూడా నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులకు కీలకం. హైదరాబాద్‌ మెట్రోలో రెడ్‌, బ్లూ లైన్ల టెర్మినల్‌ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు రాత్రి 11 గంటలకు బయలుదేరుతాయి. గ్రీన్‌ లైన్‌ మాత్రం రాత్రి 11.35 వరకు సేవలు అందిస్తుంది. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత షిఫ్ట్‌ ముగించే ఉద్యోగులకు మెట్రో ఉపయోగం చాలా పరిమితమే. షాపులు, మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర కమర్షియల్‌ సంస్థల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. సాధారణ షాపులు, మాల్స్‌ రాత్రి 9–10 గంటల మధ్య మూసేసినా.. క్లోజింగ్‌, క్యాష్‌ సెటిల్‌మెంట్‌, స్టాక్‌, క్లీనింగ్‌, సెక్యూరిటీ వంటి పనులతో ఉద్యోగులు ఆ తర్వాతే బయటకు వస్తారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌ డెలివరీ వంటి రంగాల్లో పని మరింత ఆలస్యంగా కొనసాగుతుంది. అంటే షాపు మూసే సమయం ఉద్యోగి ఇంటికి చేరే సమయం కాదు. ఇక్కడే నైట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అవసరం కనిపిస్తోంది. ఒక ఉద్యోగి రాత్రి 1 గంటకు ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చాడనుకుందాం. ఆఫీస్‌ నుంచి బస్‌స్టాప్‌ వరకు వెళ్లాలి. బస్సులో ప్రయాణించాలి. బస్సు దిగిన తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లాలి. ఈ మూడు దశల్లో ఎక్కడ భద్రత లేకపోయినా మొత్తం ప్రయాణం ఇబ్బందే. హైదరాబాద్‌ నగర పోలీసింగ్‌లో రాత్రి పట్రోలింగ్‌, బీట్‌ సిబ్బంది, మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనాలు, SHE Teams, ట్రాఫిక్‌ పోలీసింగ్‌ వంటి వ్యవస్థలు పనిచేస్తాయి. కానీ నైట్‌ షిఫ్ట్‌లో ఖచ్చితంగా ఎంతమంది పోలీసులు విధుల్లో ఉంటారు అన్న సంఖ్యను నగరవ్యాప్తంగా పోలీస్‌ శాఖ పబ్లిక్‌ డేటాగా అందుబాటులో లేదు. నగరంలో నేరాలు కూడా రాత్రి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే అంశమే. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ 2025 వార్షిక నివేదిక ప్రకారం నగరంలో మొత్తం నేరాలపై గణాంకాలు నమోదయ్యాయి.. అదే సమయంలో 2025లో మొత్తం క్రైమ్‌ రేట్‌ తగ్గిందని పోలీస్‌ శాఖ తెలిపింది. హైదరాబాద్‌ మాత్రమే కాదు.. విస్తృత హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 2025లో 30,040 కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున సుమారు 82 కేసులు. ఇది హైదరాబాద్‌ సిటీ పోల

Original source: tv9telugu.com
Read more on Kaizer News