Kaizer News

FIH World Cup | వ‌రుస‌గా నాలుగో ప్ర‌పంచ‌క‌ప్ గెలువ

FIH World Cup | వ‌రుస‌గా నాలుగో ప్ర‌పంచ‌క‌ప్ గెలువాల‌న్న నెద‌ర్లాండ్స్ ఆశ‌ల‌పై నీళ్లు.. టైటిల్ నెగ్గిన అర్జెంటీనా

· International · ntnews.com

FIH World Cup : మహిళల హాకీ ప్రపంచకప్ (Women Hockey World Cup) ను అర్జెంటీనా (Argentina) కైవసం చేసుకుంది. నిన్న‌ ఆమ్‌స్టెల్‌వీన్‌ (Amstelveen) లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో అర్జెంటీనాను విజ‌యం వ‌రించింది. షూటౌట్‌లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్‌ (Nedarlands) ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. వ‌రుస‌గా నాలుగో మ‌హిళా ప్ర‌పంచ‌క‌ప్ గెలువాల‌న్న నెద‌ర్లాండ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఆట నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఆట 30వ నిమిషంలో యిబీ జాన్సన్ గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ద్వితీయార్థంలో పుంజుకున్న అర్జెంటీనా 54 వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. మారియో గ్రానాటో అద్భుతమైన గోల్‌తో స్కోరును సమం చేయడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్‌లో అర్జెంటీనా క్రీడాకారిణులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ జట్టు తరఫున విక్టోరియా గ్రానాటో, బ్రిసా, సోఫియా కైరో గోల్స్ సాధించగా.. నెదర్లాండ్స్ జట్టులో మారీన్ మాత్రమే లక్ష్యాన్ని చేర గలిగింది. దాంతో అర్జెంటీనా విజయం ఖాయమైంది. అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. గతంలో 2002, 2010 లోనూ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌పైనే గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదే టోర్నీలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 1-0 తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది

Original source: ntnews.com
Read more on Kaizer News