Burning Topic: చైనా అధినేత జిన్ పింగ్ సెప్టెంబరులో భారత్ పర్యటనకు వస్తున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం జిన్ పింగ్ ప్రధాన అజెండా. అయితే బ్రిక్స్ సమావేశంతో పాటు భారత్ తో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారం కూడా జిన్ పింగ్ అజెండాలో ఉన్నట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. కాగా కొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాలు శరవేగంగా మారిన సంగతి తెలిసిందే. సుంకాల దెబ్బ నేపథ్యంలో అమెరికాకు భారత్ దూరమైంది. అదే సమయంలో చైనాకు భారత్ దగ్గరైంది. దీంతో చైనా అధినేత జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్ తో సరిహద్దు వివాదాల పరిష్కారానికి చైనా అధినేత జిన్ పింగ్ చొరవ చూపుతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం 400 మంది ఉన్న ప్రతినిధి బ్రుందంతో భారత్ కు రావడానికి చైనా అధినేత జిన్ పింగ్ సన్నద్ధమవుతున్నారు. భారత్ -చైనా సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ గొడవలు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి చైనాకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు భారత్ నిజాయితీని చైనా నమ్మడం లేదు. దీంతో సరిహద్దు వివాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి చైనాది వంకర బుద్ధి. పొరుగుదేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న చిత్తశుద్ధి ఆ దేశానికి లేదు. అసలు ఉండదు కూడా. పొరుగు దేశాలతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించాలన్న సోయ చైనా పాలకులకు లేకుండా పోయింది. విస్తరణ కాంక్ష ముందు పొరుగుదేశాలతో చేసుకున్న సైనిక ఒప్పందాలు చైనా పాలకుల కంటికి కనిపించడంలేదు. దీంతోనే సమస్యలు పుట్టుకొస్తున్నాయి.డ్రాగన్ కంట్రీ విస్తరణ కాంక్షకు పొరుగుదేశాలు బలవుతున్నాయి. ఇదిలా ఉంటే, పొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా 2022లో ఓ చట్టాన్ని చేసింది.భారత్ తో సరిహద్దు గొడవలకు సంబంధించి చైనా ప్రత్యేకంగా చట్టం చేయడం ఇదే తొలిసారి అంటున్నారు మిలటరీ నిపుణులు. చైనా చేసిన ఈ ప్రత్యేక చట్టం ఫలితంగా రానున్న రోజుల్లో భారత్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవానికి మొత్తం 14 దేశాలతో దాదాపు 22 వేల కిలోమీటర్ల మేర సరిహద్దును చైనా దేశం పంచుకుంటోంది.అయితే దాదాపుగా అన్ని దేశాలతో చైనా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంది.ఇప్పటికీ భారత్ అలాగే భూటాన్‌తోనే చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే చైనాతో 3,488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దు ఉంది. ఇది మూడు సెక్టార్ ల ద్వారా వెళుతుంది. వెస్ట్రన్ సెక్టార్ అంటే జమ్మూ కాశ్మీర్, సెంట్రల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉంటుంది. నార్త్ సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ల ప్రాంతాల నుంచి వెళుతుంది. చైనా, భారత్ మధ్య చాలాకాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేవంటున్న