తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన దర్శకత్వంలో మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డోరతీ' (Dorothy). ఇదొక సైకాలజికల్ యాక్షన్ డ్రామా. సనంత్, రిషి కాంత్ హీరోలు. సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. లేటెస్టుగా ట్రైలర్ విడుదల చేశారు. స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్? తమిళనాడు గ్రామీణ ప్రాంత నేపథ్యంలో 'డోరతీ' తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. చిన్నప్పటి నుంచి హీరోలు ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహం చూసి జనాలు అందరూ గొప్పగా చెప్పుకొనేవారు. అటువంటి వాళ్ళ జీవితాల్లోకి డోరతీ (కీర్తీ సురేష్) రావడంతో మనస్పర్థలు, గొడవలు వస్తాయి. స్నేహితుల మధ్య ఓ మహిళా ఎటువంటి గొడవలకు కారణం అయ్యింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. స్నేహం, ప్రేమ, అసూయ, నమ్మకం, ప్రతీకారం వంటి భావోద్వేగ అంశాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. .. విజయ్ తనయుడు ఎలా తీశాడంటే? దర్శకుడిగా 'పిజ్జా' (2012) కెరీర్ ప్రారంభించిన కార్తీక్ సుబ్బరాజ్... ఇన్నేళ్ళ దర్శక ప్రయాణంలో చేసిన సినిమాలు తక్కువే. ఆయన 10వ సినిమా 'డోరతీ'. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'పేటా' లాంటి సినిమా తీసిన ఘనత ఆయన ఖాతాలో ఉంది. స్టార్ హీరో సూర్యతో 'రెట్రో' బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక 'డోరతీ' విషయానికి వస్తే... టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రీమియర్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. .. ఆస్కార్ 2027కు ఇండియా ఎంట్రీ 'డోరతీ' సినిమాకు జ్యోతి దేశ్‌పాండే, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ నిర్మాతలు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఈ నెల 25న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కంటే ముందు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమాలో స్పెషల్ సాంగ్ 'యేష నాగుల' పాటలో కీర్తీ సురేష్ మాస్ స్టెప్పులు వేశారు. .. గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు? Up Next Up Next Up Next Up Next రెండు ఓటీటీల్లో మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - జబర్దస్త్ అదిరే అభి మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం తిరుపతి తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ అరెస్ట్ విజయవాడ పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పాలిటిక్స్ జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు? ప్రపంచం ఇక భారత్‌పై 100 శాతం టారిఫ్ మోత ! రష్యా ఆంక్షల చట్టానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం క్రైమ్ ఎగ్జామ్ హాల్‌లో చాట్ జీపీటీ వాడుతూ