కాంగ్రెస్ బృందం జన్వాడ ఫామ్‌హౌస్ పరిశీలనకు వెళ్లడంతో ఉద్రిక్తత. సీఎం ఆదేశాలతో కేసీఆర్, హరీష్ రావు ఆస్తులపైనా విచారణ. ఫామ్‌హౌస్ తనదేనని ప్రదీప్ రెడ్డి, కేటీఆర్‌కు లీజుకు ఇచ్చానన్నారు. చట్టబద్ధ పత్రాలు ఉన్నాయని, ప్రభుత్వ విచారణకు సహకరిస్తానని స్పష్టీకరణ. శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది కేటీఆర్ ఫాం హౌస్ అని, అన్ని నిజాలు బయటపెడతామంటూ ఉదయం 10:30 గంటలకు ప్రజాభవన్ నుంచి కాంగ్రెస్ నేతల బృందం జన్వాడ ఫామ్ హౌస్‌కు బయలుదేరింది. ఈ ఫామ్‌హౌస్ భూముల రికార్డులు, యాజమాన్య వివరాలు, ప్రభుత్వ భూములతో ఉన్న సంబంధాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనుండటంతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఆస్తులు, భూముల వివరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆపై వెలికట్టలో హరీశ్ రావు బంధువుకు చెందిన అసైన్డ్ భూములను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ క్రమంలో ఇప్పుడు జన్వాడకు వెళ్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పేదవాళ్లం అని చెప్పే కేటీఆర్‌కు ఈ విలువైన ఆస్తులు, ఫాం హౌస్ ఎలా వచ్చాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ టీం సైతం జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉందని భారీగా పోలీసులను మోహరించారు. జన్వాడ ఫామ్ హౌస్ నాది.. కేటీఆర్ సొత్తు కాదు: ప్రదీప్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా ఉన్న వాటిలో కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌తో పాటు జన్వాడ ఫామ్‌హౌస్ ఒకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ ఫాం హౌస్‌పై ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ నాయకులు ఫామ్‌హౌస్‌ను సందర్శిస్తారన్న ప్రచారాలు జోరందుకున్నాయి. ఉదయం నుంచి అక్కడ హడావుడి కనిపిస్తోంది. దాంతో ఆ స్థలానికి అసలైన యజమానిని నేనేనంటూ ప్రదీప్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఫామ్‌హౌస్ వద్ద మాట్లాడుతూ.. అసలు యజమానిని తానేనని, అది కేటీఆర్ ఆస్తి కాదని క్లారిటీ ఇచ్చారు. జన్వాడలో ఉన్న 4 ఎకరాల భూమి పూర్తిగా తన స్వార్జితమని, 2019లో అన్ని చట్టబద్ధమైన ప్రక్రియలను పూర్తి చేసి కొనుగోలు చేశానని తెలిపారు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన నూటికి నూరు శాతం చట్టబద్ధమైన టైటిల్ పత్రాలు తన వద్ద ఉన్నాయని, కేటీఆర్‌కు తాను కేవలం లీజుకు మాత్రమే ఇచ్చానని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడని, అందుకు ఆయనకు చట్టప్రకారమే లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదా నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి లేదా రెవెన్యూ అధికారులకు ఈ స్థలంపై ఎలాంటి అనుమానాలున్నా నేరుగా నోటీసులు ఇవ్వాలన్నారు. ఆ నోటీసులకు స్పందించి జన్వాడ ఫామ్ హౌస్ గురించి వివరణ ఇస్తానని, ప్రభుత్వానికి, చట్టపరమైన విచారణకు తాను సహకరిస్తానని ప్రదీప్‌రెడ్డి ప్రకటించారు. అయితే వ్యక్తిగత ఆస్తులను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం