Kaizer News

బోల్డ్ సీన్స్ చేశానని.. చాలా సింపుల్‌గా అడుగుతున్న

బోల్డ్ సీన్స్ చేశానని.. చాలా సింపుల్‌గా అడుగుతున్నారు: రాధికా ఆప్టే

· Entertainment · sakshi.com

తెలుగులో బాలయ్య సరసన మెప్పించిన బ్యూటీ రాధికా ఆప్టే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-3 వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. గతంలో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అలాంటి పాత్రలు చేయడం లేదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ నటి.. బోల్డ్ సీన్స్‌ ఎంపిక, కథకు అవసరాలపై మాట్లాడింది. కొందరు కథకు అవసరం లేకపోయినా తనతో ముద్దు సీన్లు చేయించేందుకు యత్నించారని రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తాను చేసిన బోల్డ్ పాత్రల వల్ల అలానే చేస్తానని అడిగారని గుర్తు చేసుకుంది. తనను కేవలం లోదుస్తులతో ఓ యాక్షన్ సన్నివేశంలో నటించాలని కూడా కోరారని రాధికా తెలిపింది. కొందరైతే ఓ 15 సెకన్లు ఏదో అలా ముద్దు సీన్ కవర్ చేసేయండి చాలా సింపుల్‌గా అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఆ సీన్ చేయడానికి అంగీకరించలేదని వెల్లడించింది. అయితే ఆ సీన్ నన్ను చేయమని అడిగిన వ్యక్తి పేరు చెబితే మీరంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది. రాధికా మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నగ్నంగా నటించా. కానీ అదంతా అప్పుడు చేశా. అది చూసే నన్ను సులభంగా ఓకే చెబుతుందిలే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయా. అలాంటి సీన్స్ చేయడం లేదు. తానే చేసే మూవీలో బోల్డ్ సీన్స్ చేయడానికి కారణం చెప్పాలని అడుగుతున్నానని' పేర్కొంది. కాగా.. రాధికా ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్-3 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News